న్యూస్ అప్డేట్స్..

హైదరాబాద్‌లో నేటి నుండి 3 రోజులు వైన్స్ బంద్

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించిన పోలీసులు…

కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసిన హైకోర్టు

మూసీ ప్రక్షాళణ పేరుతో రేవంత్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేసు

గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ

ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు

ఇరువైపుల వాదనలు విని తీర్పు వెలువరించిన జస్టిస్ కె.లక్ష్మణ్…

రెండు లక్షల రుణమాఫీ కాలేదు..మంత్రులకు విజ్ఞప్తి చేసిన నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

రూ.2 లక్షల లోపు రుణం ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదని, వెంటనే రుణమాఫీ చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేసిన నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

రుణమాఫీ కాలేదని చెప్పడంతో చప్పట్లు కొట్టిన రైతన్నలు…

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమైక్యవాదులు.. వాళ్ళు ఇవాళ ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉపముఖ్యమంత్రి అయ్యారు..మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్.

తెలంగాణ ఇచ్చినప్పుడు.. తెలంగాణ ఇవ్వొద్దని వ్యతిరేకించిన టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు

ఇవాళ అదే సమైక్యవాదులు,, ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులను చేశారు

ఇవాళ సెక్రటేరియట్లో 10, 12 శాతం కమిషన్ ఇస్తే కానీ బిల్లులు రావడం లేదు

ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను 5 సార్లు కలిస్తే ప్రతిసారి నన్ను నిల్చోబెట్టి మాట్లాడాడు

నువ్వు బట్టలు ఊడదీసి కొడుతా అంటున్నావు కదా.. నువ్వు ముందు కొట్టాల్సింది నీ మంత్రులనే

ఎందుకంటే వాళ్ళు అవినీతి చేస్తున్నారు.. నువ్వు జరిగితే నీ సీట్లో కూర్చోవాలని చూస్తున్నారు – మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు..

*జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్*

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొన సాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈరోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మవోయి స్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి.209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ కోబ్రా, దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి, ఇందులో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికార వర్గాలు తెలిపాయి….

*దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రెడీ.. జులై నుంచి పట్టాలపై పరుగులు*

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జూలై నుంచి హర్యానాలోని జీంద్ జిల్లాలో పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది.

ఈ తొలి తొలి హైడ్రోజన్ రైలు చెన్నైలో సిద్ధమవుతోంది. అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానుంది. ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ ఆదివారం హైడ్రోజన్ ప్లాంట్ను పరిశీలించారు.

చెన్నైలో తయారు చేస్తున్న రైలును జీంద్ కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుందని అశోక్ వర్మ తెలిపారు…