వెబ్ సిరీస్‌ను తలపించిన దొంగతనం.. ఏటీఎంను కారుకు కట్టి లాక్కెళ్లిన దొంగలు!
ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో దొంగలు ఏటీఎంను టార్గెట్ చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం సెంటర్ షట్టర్‌ను కట్ చేసిన దుండగులు.. మెషీన్‌ను బయటకు తీసి తాడుతో కారుకు కట్టేశారు.
అనంతరం కారుతో ఏటీఎంను సుమారు 500 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతంలో మరో కారులోకి తరలించినట్లు సమాచారం. ఏటీఎంలో ఎంత నగదు ఉందన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదంతా చూస్తుంటే ‘Pritam and Pedro’ వెబ్ సిరీస్‌లో చూపించిన చోరీ సీన్ గుర్తొస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.