(దసరా)దేవి శరన్నవరాత్రి
ఉత్సవాల సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు..
బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని 24వ వార్డులో దుర్గామాత మండపమును సందర్శించి, అమ్మవారి విగ్రహం వద్ద నాల్గవ రోజు జరిగిన మహా చండీ పూజా కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన హుజుర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి డా.కొప్పుల సైదిరెడ్డి, హుజుర్నగర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, 24వ వార్డు ఇంచార్జ్ శీలం నాగరాజు, వీరమల్ల సుందరయ్య, రమేష్ యూత్ సభ్యులు అంజి తితు వినయ్ శ్రీను సింహాద్రి లచ్చి రమేష్ సూరి గోపి పండు దుర్గామాత ఉత్సవ కమిటీ నిర్వాహకులు,కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు..*ఈ సందర్భంగా కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ..*అమ్మవారి ఆశీస్సులతో.. హుజుర్నగర్ నియోజకవర్గం ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలనీ, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు నియోజకవర్గ ప్రజలందరిపై శ్రీ దుర్గాదేవి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.