కేటిఆర్ కు ప్రభుత్వ విప్ వేముల వీరేశం కౌంటర్..

కేటిఆర్ కు ప్రభుత్వ విప్ వేముల వీరేశం కౌంటర్..

సింగరేణి కి కేటిఆర్ సినిమా ప్రమోషన్ లాగ పోయిండు

కేటిఆర్ రాగం ఒకటి ఎత్తుకుండు

పాట ఒకటి పాడుతుండు

గడ్డం పెంచుకుని వేషం మారుస్తున్నారు

గడ్డం పెంచుకుంటే రేవంత్ రెడ్డి లాగ అధికారంలోకి వస్తా అనుకుంటుండు

కేటిఆర్ మానసిక పరిస్థితి బాగోలేదు

కేటిఆర్ మానసిక స్థితిని చూసి చర్చించుకుంటున్నారు

దోచుకుంది దాచుకోవడానికి సతమతమవుతున్నారు

దమ్ముంటే ఈ కార్ రేసు,కాళేశ్వరం లో విచారణ చేయమని కేటిఆర్ లేఖ రాయాలి

సింగరేణి లో చెల్లె ఒక భాగం, సంతోష్ రావు ఒక భాగం దోచుకున్నారు

సిరులు కురిపించే సింగరేణి ని చెరబట్టి దోచుకున్నారు..

సింగరేణి ని దోచుకున్న మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..

సింగరేణి కి ద్రోహం చేసింది మీరు కదా?

నగ్నంగా దొరికిన దొంగ కేటిఆర్

మూడు హోటల్స్ ఉన్నాయని కేటిఆర్ ఒప్పుకుండు

సార్ కేసీఆర్ బయటకు వస్తాడు అని కేటిఆర్ అంటుండు

సారేమో బయటకు రాడు

సింగరేణి లో కార్మికుల సమస్యలు మాట్లాడుతారు అనుకున్నాం

అక్కడ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నాడు

రేవంత్ రెడ్డి విజన్ తో ప్రజలు ఏకీభవిస్తున్నారు

అందుకే కేసీఆర్ బయటకు రారు

ఎలినినో కు రేవంత్ రెడ్డి కారణం అంటుండు

కరోనకు మీ అయ్యా కారణం!

పారా సిట్ మాల్ వేసుకోమని మేము ఏమైన చెప్పామా?

1951నుండి 2026 వరకు 16సార్లు ఎలినినో పరిస్థితులు వచ్చాయి

ఎలినినో తో వర్షాభావం తగ్గింది అని ఎక్స్పర్స్ట్ చెప్పారు..

కేటిఆర్ సోయి లేకుండా మాట్లాడుతుండు అని ఆరోపించారు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికార పార్టీ నుంచి ఎదురుదాడి మొదలైంది. సింగరేణి కార్మిక గర్జనలో ఆయన చేసిన ఆరోపణలకు ధీటుగా కౌంటరిచ్చింది కాంగ్రెస్ సర్కార్. ప్రస్తుతం కేటిఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన్ని చూసి ప్రజలు చర్చించుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం.

కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగరేణి కార్మిక గర్జన గురించి కీలక విషయాలు బయటపెట్టారు ప్రభుత్వం విప్ వేముల వీరేశం. సింగరేణి‌కి కేటిఆర్ సినిమా ప్రమోషన్ మాదిరిగా వెళ్లారని, అక్కడ కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఆరోపించారు. గడ్డం పెంచుకుని వేషం మారుస్తున్నారని, గడ్డం పెంచుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాదిరిగా అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం మీడియా ముందుకొచ్చిన విప్ వీరేశం.. ప్రస్తుతం కేటిఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన్ని చూసి చర్చించుకుంటున్నారని విమర్శించారు.