తెలంగాణలో కరెంట్ కోతలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి- ఎంపీ రఘునందన్‌.

తెలంగాణలో కరెంట్ కోతలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు
విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి-రఘునందన్‌.

క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
హామీలు నెరవేర్చకుండా SIRపై ఆరోపణలా..

కొండారెడ్డిపల్లిలో ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పాలి
SIRలో డూప్లికేట్, మరణించిన వారి ఓట్లే తొలగించారు..-బీజేపీ ఎంపీ రఘునందన్..

బిజెపి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా గృహ, వ్యవసాయ రంగాలకు కరెంట్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..గ్రామాల్లో, పట్టణాల్లో అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తుండటం వల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.