సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ కేటీఆర్‌ ఫైర్‌.

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ అర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి నిండా కుంభకోణాలు ఉన్నాయి అని నేను చెప్పిన. కాంగ్రెస్ చేసిన కుంభకోణాలని ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు. నువ్వు ఉత్తరం రాస్తే నేను విచారణకు ఆదేశిస్తా అన్నాడు. bమీడియా ముందు మాట్లాడుడు కాదు, దమ్ముంటే సింగరేణి కుంభకోణం పైన ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు..బొగ్గు అంశంలోనే కాదు,దమ్ముంటే నువ్వు చేసిన అక్రమాలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశించు. నీ బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన 10వేల కోట్ల కుంభకోణంపై విచారణ వెయ్యి. సింగరేణిలో నువ్వు చేసిన సోలార్ పవర్ కుంభకోణం బయటపెడతానని పేర్కొన్నారు. సింగరేణిని బొందపెట్టి ఇప్పుడు 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిని కాదని విదేశీ బొగ్గు తేవడానికి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో రాష్ట్రంలో 24 గంటల పాటు కరెంట్ పోకుండా అండగా నిలబడింది సింగరేణి…ఇప్పుడు అదే సింగరేణిని రేవంత్ రెడ్డి బద్నాం చేస్తున్నాడని మండిపడ్డారు. సంక్షోభంలోకి నెట్టిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి బొగ్గు తేవాలి, కరెంట్ కొనాలి అని అంతా ఆగమైనంక చెబుతున్నాడు…

రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సింగరేణి కుంభకోణంపై, విదేశీ బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశించు…మీడియా ముందు మాట్లాడుడు కాదు…

బొగ్గు అంశంలోనే కాదు, దమ్ముంటే నువ్వు చేసిన అక్రమాలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశించు…
సింగరేణిలో కాంగ్రెస్ చేసిన కుంభకోణాలని ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు…
నీ బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన 10 వేల కోట్ల కుంభకోణంపై విచారణకి ఆదేశించు…
సింగరేణిలో నువ్వు చేసిన సోలార్ పవర్ కుంభకోణం బయటపెడతా…
సింగరేణిని బొందపెట్టి, ఇప్పుడు 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిని కాదని విదేశీ బొగ్గు తేవడానికి కుట్ర చేస్తున్నాడు.

గతంలో రాష్ట్రంలో 24 గంటల పాటు కరెంట్ పోకుండా అండగా నిలబడింది సింగరేణి..

ఇప్పుడు అదే సింగరేణిని బద్నాం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి..

సింగరేణిలో రూ.3800కి టన్ను బొగ్గు దొరికితే అది వద్దు అని, విదేశాలలో రూ.12000 పెట్టి కమీషన్లు కొట్టడం కోసం బొగ్గు కొనాలని కుట్ర చేస్తున్నాడు..రేవంత్ రెడ్డి పదవి రెన్యువల్ కాదు

కరెంట్ సరఫరా వ్యవస్థను పండబెట్టి, ఇప్పుడు కొందామంటే కరెంట్ లేదు అని అబద్ధాలు మాట్లాడుతున్నారు….