PRTU తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా రామావత్ బాలాజీ నియామకం..!

దేవరకొండ ……….
దేవరకొండ పట్టణానికి చెందిన రామావత్ బాలాజీ PRTU తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు, విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రామావత్ బాలాజీ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, ఉపాధ్యాయ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తనకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన PRTU తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని వెల్లడించారు.
రామావత్ బాలాజీ కి రాష్ట్ర కార్యదర్శి పదవి లభించడం పట్ల దేవరకొండ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసినారు.