ఇప్పటికే వాతావరణం ప్రతికూలత…
సూపర్ ఎల్‌నినోతో ముప్పు..
పెరిగే ఉష్ణోగ్రతలు ముఖ్యంగా పేద దేశాలపై తీవ్ర ప్రభావం...
El Nino Effect on
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎల్ నినో గురించే మాట్లాడుతోంది. డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చూడని ముప్పు ముంచుకొస్తోందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు “ఎల్ నినో” అంటే ఏంటి? అది ఎందుకు ఏర్పడుతుంది? దానివల్ల ప్రపంచం మీద, మన దేశం మీద, మన రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ..
ప్రపంచ వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులకు కారణమయ్యే ఎల్ నినో ప్రభావం మరింత బలపడుతున్నట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ (IRI) సెప్టెంబర్ 21న విడుదల చేసిన తాజా ENSO అంచనా ప్రకారం.. 2026 చివరి నాటికి, 2027 ప్రారంభంలో ఎల్ నినో పరిస్థితులు “చాలా బలమైన” స్థాయిలో కొనసాగవచ్చు. ఈ పరిణామం ఆసియా దేశాలతో పాటు భారత్‌లోనూ వాతావరణ సంబంధిత ప్రమాదాలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు..
ప్రపంచ వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులకు కారణమయ్యే ఎల్ నినో మరింత బలపడుతున్నట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి. కొలంబియా యూనివర్సిటీకి చెందిన International Research Institute for Climate and Society (IRI) తాజా ENSO అంచనా ప్రకారం 2026 చివరి నాటికి, 2027 ప్రారంభంలో ఎల్ నినో చాలా బలమైన స్థాయిలో కొనసాగే అవకాశం..
ఈ ప్రక్రియ వల్ల వేడి గాలులు వీస్తాయి. దాంతో వర్షాలు కురిసే పరిస్థితి ఉండదు. భారతదేశంతోపాటు యూరప్ వంటి ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనివల్ల రుతుపవనాలు సకాలంలో రావు. ఈ పరిస్థితి మన దేశంపై ఎక్కువగానే ప్రభావం చూపుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఎంత అనేది వేడెక్కిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. దీంతో పంటల దిగుబడి తగ్గిపోయి, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది….ఎల్ నినో బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో నినో 3.4 ఇండెక్స్ ఒకటి. మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను ఇది సూచిస్తుంది. IRI ప్రకారం 2026 సెప్టెంబర్ మధ్య నాటికి నినో 3.4 సూచిక +3.0 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఆగస్టు నెలలో ఇది +2.52 డిగ్రీలుగా ఉండగా, సెప్టెంబర్ మధ్య నాటికి మరింత పెరగడం ఎల్ నినో తీవ్రత వేగంగా పెరుగుతున్న సంకేతంగా కనిపిస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. IRI పరిశీలించిన మొత్తం 22 వాతావరణ నమూనాలు ఎల్ నినో మరింత బలపడే అవకాశాన్ని సూచించాయి. ఇందులో 13 డైనమిక్ మోడళ్లు, 9 స్టాటిస్టికల్ మోడళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ 2026-27 శీతాకాలంలో ఎల్ నినో “వెరీ స్ట్రాంగ్” స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. కొన్ని మోడళ్లు నినో 3.4 ఉష్ణోగ్రత అసాధారణత +4.0 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశాన్ని కూడా సూచిస్తున్నాయి…
ఇప్పటికే వాతావరణం ప్రతికూలత ఏర్పడింది..
ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ సాయంత్రం ఉక్కపోత...
ముదురుతున్నాయి. మధ్యాహ్నం పన్నెండు నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోత, వేడిగాలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలం షురూలోనే ఇంత ఎండలుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు..అక్టోబరులో చలి బదులు ఎండల ప్రకోపం
అక్టోబర్ 1వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 34 డిగ్రీలు ఉండగా, అక్టోబర్ 2న 33 డిగ్రీలకు, అక్టోబర్ 3న ఒక్కసారిగా 30 డిగ్రీలకు పడిపోయింది. ఆ తర్వాత అక్టోబర్ 4 నుంచి ఉష్ణోగ్రతలు తిరిగి 33 నుంచి 34 డిగ్రీల మధ్యకు వచ్చాయి. అక్టోబర్ 8 నాటికి ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుని 34.5 డిగ్రీలకు చేరాయి. అంటే అక్టోబర్ 3న నమోదైన 30 డిగ్రీల నుంచి కేవలం 5 రోజుల్లోనే ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలు పెరిగింది. ఒకే రోజులో కనిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలకు దాదాపు 11.3 డిగ్రీల తేడా కనిపిస్తోంది. ఇక ఉదయం 8.30 గంటలకు తేమ శాతం 85 శాతం వరకు ఉండటం వల్ల ఉక్కపోత మరింత ఎక్కువగా ఉంటోంది..
ముందస్తు చర్యలకు ఉపయోగపడనున్న అంచనాలు
వాతావరణ పరిస్థితులపై ముందస్తు అంచనాలు ప్రభుత్వాలకు తగిన చర్యలు తీసుకోవడంలో ఉపయోగపడతాయని క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ తెలిపింది.
ముఖ్యంగా హీట్ వార్నింగ్‌లు ముందుగానే జారీ చేయడం, కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ప్రజలకు తాగునీటి సదుపాయాలను పెంచడం వంటి చర్యలు చేపట్టవచ్చని పేర్కొంది.
ఎండలో, ఆరుబయట పనిచేసే ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించడం, అధిక ఉష్ణోగ్రతలతో వచ్చే అనారోగ్యాలను ఎదుర్కొనేలా ఆరోగ్య వ్యవస్థను ముందుగానే సిద్ధం చేయడం వంటి చర్యలకు ఈ అంచనాలు ఉపయోగపడతాయని తెలిపింది…ఈ ప్రక్రియ వల్ల వేడి గాలులు వీస్తాయి. దాంతో వర్షాలు కురిసే పరిస్థితి ఉండదు. భారతదేశంతోపాటు యూరప్ వంటి ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనివల్ల రుతుపవనాలు సకాలంలో రావు. ఈ పరిస్థితి మన దేశంపై ఎక్కువగానే ప్రభావం చూపుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఎంత అనేది వేడెక్కిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. దీంతో పంటల దిగుబడి తగ్గిపోయి, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.
సాధారణ రోజుల్లో భూమధ్యరేఖ వెంబడి తూర్పు నుండి పశ్చిమానికి.. అంటే అమెరికా నుంచి ఆసియా, ఆస్ట్రేలియా వైపు బలమైన వాణిజ్య పవనాలు వీస్తుంటాయి. అయితే, కొన్ని ఏళ్లకు ఈ గాలులు హఠాత్తుగా బలహీనపడతాయి. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని ఉపరితల జలాలు వెనక్కి ప్రవహించి, అమెరికా ఖండాల తీరానికి చేరుకుంటాయి. దాంతో అక్కడ సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కి, ఆ వేడి వాతావరణంలోకి విడుదల అవుతూ ఉంటుంది. దీనివల్ల క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతుంది. ఈ ప్రక్రియనే ఎల్ నినో అంటారు.
2027లోనూ కొనసాగనున్న ఎల్‌నినో?.
ఉత్తరార్ధగోళంలో ఎల్‌నినో ప్రభావం చాలా బలంగా ఉండొచ్చని పేర్కొంది.
1901లో ఉష్ణోగ్రతల రికార్డుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి.. 2026 ఆగస్టు అత్యంత వేడిగా నమోదైన ఆగస్టుగా నిలిచిందని తాజా అంచనాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న నెలల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు కీలకంగా మారనున్నాయి.