Bihar worker held in Bengaluru over viral AI video of Vidhana Soudha bomb blast.
కర్ణాటక విధానసౌధలో బాంబు పేలుడు జరిగినట్లు AI వీడియో.. బిహార్‌కు చెందిన హజ్రత్ అలీ అరెస్ట్! బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ భవనం విధానసౌధలో భారీ పేలుడు జరిగినట్లు ఏఐతో నకిలీ వీడియో రూపొందించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 25 ఏళ్ల హజ్రత్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో వెనుక ఉద్దేశం, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది..
ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ వీడియో వైరల్
https://x.com/TeluguStride/status/2113074888894488871?s=20
బీహార్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల హజ్రత్ అలీ అనే వ్యక్తి విధానసౌధ భవనంలో భారీగా పొగలు కక్కుతూ పేలుడు సంభవించినట్లు అత్యంత సహజంగా అనిపించే AI వీడియోను రూపొందించాడు. అనంతరం ఈ ఫేక్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అత్యంత సున్నితమైన.. భద్రత కలిగిన ప్రభుత్వ భవనంలో పేలుడు జరిగినట్లు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి..
ఈ నకిలీ వీడియోపై సమాచారం అందుకున్న బెంగళూరు సైబర్ క్రిమినల్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. వీడియో ఆధారాలను విశ్లేషించి, దానిని సృష్టించి పోస్ట్ చేసిన హజ్రత్ అలీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీసులు నిందితుడిని తీవ్రంగా విచారిస్తున్నారు. అసలు ఈ తరహా వీడియోను రూపొందించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి? కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసమే చేశాడా? లేక దీని వెనుక ఇతర వ్యక్తులు లేదా శక్తుల ప్రమేయం ఉందా? అనే విభిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలను షేర్ చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు…మంగళవారం ఉదయం “jnx_king_h_g” అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తుపాకీ సంజ్ఞ చేస్తూ విధాన సౌధపై కాల్పులు జరుపుతున్నట్లు నటిస్తున్న వీడియోను, ఆ తర్వాత భవనంలో పేలుడు జరుగుతున్నట్లు ఎడిట్ చేసిన క్లిప్‌ను ‘విధానసభ ఉడా దియా బం సే’ అనే క్యాప్షన్‌తో అప్లోడ్ చేశారు..