నల్గొండ:
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సంతోషిమాత కాలనీలో మైనర్ కారు నడిపి బీభత్సం సృష్టించాడు. కాలనీకి చెందిన గోగీకర్ ప్రభాకర్ జీ ఇంట్లోకి శుక్రవారం కారు దూసుకు వచ్చింది. దీంతో ఇంటి గోడ కూలిపోయింది. ఆవరణలో బోరు, విద్యుత్ సరఫరా వైర్లు ధ్వంసమైనట్లు బాధితులు తెలిపారు. మైనర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.