ప్రభుత్వం మహిళల మంచి కోసం ఫ్రీ బస్సు స్కీం ప్రవేశ పెడితే..
https://x.com/r9telugunews/status/2115086988831580542?s=20
కొంతమంది దాని అర్థాన్ని మార్చేసేలా వ్యవహరిస్తున్నారు..
తెలంగాణలో మహిళల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి పథకం) ఒకవైపు ప్రశంసలు అందుకుంటుంటే.. మరోవైపు రకరకాల సమస్యలకు కారణం అవుతోంది. అయితే ఇప్పటికే బస్సుల్లో మహిళల మధ్య గొడవలు జరిగి సిగపట్లు జరుగుతుండగా.. సీట్ల కోసం పురుషులు, స్త్రీలకు కూడా ఘర్షణలు.. ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి అనేక రకాల కొట్లాటలు జరుగుతున్నాయి. తాజాగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం.. మరో విచిత్రమైన సమస్యకు కారణమైంది. ఫ్రీ బస్ స్కీం కారణంగా ఓ వ్యక్తి తనకు ఎదురైన సంఘటనను ఎమ్మెల్యే ముందు చెప్పుకుని ఆవేదన వెళ్లగక్కాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉంది కదా అని.. తన భార్య తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది సర్.. దయచేసి ఆ ఫ్రీ బస్సును తీసేయండి అంటూ ఒక వ్యక్తి స్వయంగా ఎమ్మెల్యే ముందే తన గోడును వెళ్లబోసుకున్న సంఘటన మానకొండూర్ నియోజకవర్గంలో వెలుగుచూసింది..
ఫ్రీ బస్సుతో సోషల్ వైరల్..
ఫ్రీ బస్సులో సీట్ కోసం మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వీడియోలు, మగవారిని సీటులో నుంచి లేవమని రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చుశాం. ఇప్పుడు ఫ్రీ బస్సు మీద మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రీ బస్సు ఉందని తన భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని.. రూ.రెండు వేలు ఖర్చు చేసి ఐదు రోజులు వెతికానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు బాధితుడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది….బెజ్జంకి మండలం రేగులపల్లిలో జరిగింది ఈ ఘటన. గ్రామానికి చెందిన కనకయ్య అనే వ్యక్తి తన భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని..
దయచేసి ఫ్రీ బస్సు తీసేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నాడు.
ఫ్రీ బస్సు ఉందని తన భార్య వదిలేసి వెళ్లిపోయిందని..రూ. రెండు వేలు ఖర్చు చేసి ఐదు రోజులు వెతకాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు కనకయ్య..
రూ.2 వేల వరకు ఖర్చు చేశాను కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఉచిత బస్సు పెట్టి మా కుటుంబాలన్నింటినీ ఆగం చేశారు. సార్.. దయచేసి ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని రద్దు చేయండి’ అని దండం పెడుతూ వేడుకున్నాడు..