విశాఖ పట్ల కూటమి పార్టీల వైఖరికి తగిన గుణపాఠం చెప్పండి..మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు.
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పిలుపు
శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు
స్థానిక సామాజిక వర్గాలైన కాపు, యాదవ, గవరలకు రాజకీయ అధికారం లేకుండా బాబు కుట్ర..
నిజంగా విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రెండున్నరేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసారా..?
జీవీఎంసీ నిధులు రూ. 1738కోట్లను అమరావతికి తరలింపు బాబు కపట ప్రేమకు నిదర్సనం కాదా..?
వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు సూటి ప్రశ్నలు..
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్ చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఒక్కటీ ముందుకు సాగడం లేదు..
పోలవరం బ్యారేజీ ఎత్తు తగ్గించారు.. ఫిషింగ్ హార్బర్ పనులు నిలిపివేయడం ద్రోహం కాదా..
ప్రెస్ మీట్ లో ధర్మాన ప్రసాదరావు మాటు. .. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో చైతన్యవంతులైన స్థానిక ప్రజలు తమ నగరం పట్ల కూటమి పార్టీల వైఖరిని, అభివృద్ధి పట్ల వ్యవహరించిన తీరును సమగ్రంగా పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాశ్రేయస్సును, అభివృద్ధిని విస్మరించి స్వార్థ ప్రయోజనాలతో పాలన సాగిస్తున్న కూటమిలో ఉన్నటువంటి పార్టీలను ప్రశ్నించడానికి, ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ప్రజలకు ఉన్న ఏకైక బలమైన ఆయుధం ఓటు అని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానికంగా బలంగా ఉన్నటువంటి కాపు, యాదవ, గవర వంటి సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం లేకుండా చేస్తూ తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెత్తనం అప్పగించి అణగదొక్కుతున్న చంద్రబాబుకు గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కూటమిని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. విశాఖపట్నం రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నగరంగా ఉన్నా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా, ఇక్కడి నిధులను తరలించి అమరావతి అభివృద్ధి వినియోగిస్తుండటం చంద్రబాబు నైజానికి నిదర్శనమని ఆక్షేపించారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కు చెందిన రూ. 1738 కోట్లను అమరావతికి తరలించి అక్కడ పనులకు వినియోగించడం చంద్రబాబుకు విశాఖపై ఉన్న సవతితల్లి ప్రేమను తెలియజేస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖను రాజధానిగా ప్రకటిస్తే అప్పట్లో చంద్రబాబు అడ్డుకునేందుకు కుట్రలు చేసిన సంగతి ప్రజలకు తెలియనది కాదన్నారు….విశాఖ భూములపైనే ప్రేమ.. అభివృద్ధిపై ఏదీ..?
విశాఖపట్నంలో విలువైన భూములను ప్రజల అవసరాలకు, నగర అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, వాటిని ప్రైవేటు సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయిస్తున్నారు. అభివృద్ధి, ఐటీ కంపెనీల పేరుతో రూ. 99 పైసలకే అత్యంత విలువైన భూములను తనకు కావాల్సిన వారికి చంద్రబాబు ధారాదత్తం చేస్తున్నారు. తర్లువాడ సమీపంలో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ సంస్థకు 30 ఎకరాల భూమిని ఎకరాకు ఒక్క రూపాయి చొప్పున కేటాయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? రెహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలో విలువైన భూములు కేటాయించడం, మధురవాడలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కు 22 ఎకరాలు కేటాయించడం, బీచ్ రోడ్డులో మరో సంస్థకు 13 ఎకరాలకు పైగా భూమిని 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడం వంటి అంశాలపై ప్రజలకు అనుమానాలున్నాయి. ఉన్నాయి అన్నారు..