కేసీఆర్ హయాంలో కాపాడిన మియాపూర్ భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మాలని చూస్తున్నారు.. మాజీ మంత్రి హరీష్ రావు..

కేసీఆర్ హయాంలో కాపాడిన మియాపూర్ భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మాలని చూస్తున్నారు..

మియాపూర్ భూ వివాదంపై న్యాయస్థానంలో వాదించేందుకు దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను 2015లో కేసీఆర్ నియమించారు

2015 ఏప్రిల్ 7 నుంచి 2023 వరకు దాదాపు 8 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణ కోసం అలుపెరగని న్యాయపోరాటం చేసింది

2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించినప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే

నాటి కేసీఆర్ ప్రభుత్వం భూములను కాపాడితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకునేందుకు సిద్ధమైంది

మియాపూర్ తీర్పునకు అసలు పునాది పడింది ట్రినిటీ ఇన్ఫ్రావెంచర్స్ కేసు తీర్పుతోనే

గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసులో 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది

నాడు తాము సాధించిన ఆ విజయమే, ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పుకు బలమైన ఆధారాలు

ఈ రికార్డులన్నీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి తానే ఏదో సాధించినట్లు ప్రెస్ మీట్లు పెట్టి గొప్పలకు పోయి అబద్ధాలు చెప్తున్నాడు- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

న్యాయపోరాటం కేసీఆర్ హయాంలోనే: హరీశ్‌రావు మియాపూర్ 550 ఎకరాల భూవివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో పేర్కొన్న అంశాలను హరీశ్‌రావు ప్రస్తావించారు: ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్ తీర్పు ఆధారం: ఏపీ జాగీర్ల రద్దు నిబంధనలు, అతియత్ విచారణ చట్టానికి సంబంధించిన అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ.. 2023 జూన్ 15న ‘ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్ వర్సెస్ ఎం.ఎస్. మూర్తి’ కేసులో తామిచ్చిన చారిత్రక తీర్పులోని పారా 93ని తాజా తీర్పులో ప్రాతిపదికగా తీసుకున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఆ తీర్పు బీఆర్‌ఎస్ పాలనలోనే వచ్చిందని తెలిపారు..

సీఎస్ వైద్యనాథన్ నియామకం: మియాపూర్ భూములను కాపాడేందుకు సుప్రీంకోర్టులో రెండు కేసుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్‌ను ప్రత్యేకంగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

రికార్డుల సాక్ష్యం: 2003లో ఎస్‌ఎల్‌పీగా ప్రారంభమై, 2013లో సివిల్ అప్పీల్‌గా మారిన ఈ కేసులో.. కేసీఆర్ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 7 నుంచి సి.ఎస్. వైద్యనాథన్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫున రంగంలోకి దించిందని, ఆయన సుదీర్ఘకాలం పాటు వాదనలు వినిపించారని కోర్టు రికార్డులను ఆధారంగా చూపారు…