తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నేతగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా, అక్కడి నుంచి నేరుగా కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:00 గంటల మధ్య రిజర్వ్డ్ టైమ్‌లో భాగంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక అంశాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం సరిగ్గా 4:00 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజాంజాహి మార్కెట్ (ఎంజే మార్కెట్) వరకు అమిత్ షా ప్రతిష్టాత్మక మహా పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఇండీ కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఈ ఉద్యమాన్ని నిలువరించేందుకు, కేంద్రం ప్రత్యేక రైళ్ల అనుమతికి నో చెప్పింది. టీపీసీసీ ఆధ్వర్యంలో రైల్ నిలయం ముట్టడి కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది టీపీసీసీ. ఇప్పటికే అంతా ఢిల్లీ తరలివెళ్లారు.
అంతా హస్తినవైపు ఆసక్తిగా చూస్తున్న వేళ.. హైదరాబాద్ గడ్డపై మోటు భాయ్ కాలుమోపనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇండీ కూటమికి కౌంటర్‌గా చేపడుతున్న ‘లోక్తంత్ర్ బచావో.. అరాచ్కతా హఠావో’ అనే నినాదంతో భారీ ర్యాలీకి సన్నద్దమయ్యారు. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా ఈ పాదయాత్రలు చేస్తున్నా.. ప్రత్యేకంగా అమిత్ షా హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి కారణం… తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టడమేనంటున్నారు కమల నాథులు.