తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్
BPT, KNM రకం సన్నబియ్యం కిలో రూ.66
తెలంగాణ సోనా, RNR రకం కిలో రూ.74
HMT, JSR రకం కిలో రూ.79
ఈ రేట్లకు అమ్మకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లు, ట్రేడర్లకు పౌరసరఫరాల శాఖ స్పష్టం
Rice Price:
ఈ ధరలను అన్ని దుకాణాల్లో ప్రదర్శించాలని ఆదేశం…
రోజురోజుకూ పెరుగుతున్న సన్నబియ్యం రేట్లకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర సర్కారు కఠిన చర్యలకు దిగింది. సన్నబియ్యానికి ధరలను నిర్దేశించింది. సర్కారు ఆదేశాల మేరకు ఆయా రకాలను బట్టి కిలోకు రూ.66 నుంచి రూ.79 వరకు రేట్లు ఖరారు చేస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకుపైగా ఎక్కువ తీసుకోరాదని వ్యాపారులు, మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది…ఇటీవల బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం రేట్లు భారీగా పెరిగాయి. సూపర్‌ఫైన్ రకం కిలో రూ.95 వరకు, మీడియం రకం రూ.90, ఫైన్ రకం రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదలపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాపారులు, మిల్లర్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధరల పెరుగుదలకు కారణాలు, మార్కెట్లో బియ్యం నిల్వలు, సరఫరా పరిస్థితులను సమీక్షించారు. ఆయన సూచనల మేరకు న్న బియ్యానికి గరిష్ట చిల్లర ధరలను ఖరారు చేశారు..
దేశంలో వరి సాగు, ధాన్యం దిగుబడి, సేకరణలో తెలంగాణ ముందున్నప్పటికీ రాష్ట్రంలో బియ్యం ధరలు భారీగా పెరగడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు తమ మార్జిన్లను నిర్ణయించుకునే విషయంలో పరిమితులు పాటించాలని, వినియోగదారులకు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలని స్పష్టం చేశారు. నిర్ణీత ధరలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..