సౌతాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన ఆసీస్…!

మాట్ రెన్‌షా స్ఫూర్తితో డర్బన్‌లో ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించడంతో ఉత్కంఠభరితంగా ప్రారంభమైన దక్షిణాఫ్రికా పర్యటన, కేప్ టౌన్‌లో ఐదవ రోజున అవమానకరంగా ముగిసింది. ఎప్పటిలాగే బ్యాటింగ్ పతనం జరగడంతో, 1,300 రోజులకు పైగా కాలంలో తొలి సిరీస్ ఓటమిని చవిచూసింది…

టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 సీజన్ కి
ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడింది. సౌతాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన ఆసీస్..డబ్ల్యూటీసీ 2027 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. కేప్‌టౌన్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో సౌతాఫ్రికా 176 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 288 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది.

సౌతాఫ్రికా బౌలర్ సిమన్ హర్మర్(6/16) ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించగా.. కగిసో రబడా(3/39) మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ఘోర పరాజయంతో ఆసీస్ డబ్ల్యూటీసీ 2027 పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి దిగజారింది. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకింది. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా ఇదే తొలి సిరీస్ పరాజయం. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ 9 విజయాలు సాధించి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. 69.23 విన్నింగ్ పర్సంటేజీతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన న్యూజిలాండ్ 4 విజయాలు ఒక ఓటమి, డ్రాతో 72.22 విజయాల శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.

7 మ్యాచ్‌లే ఆడిన సౌతాఫ్రికా 5 విజయాలు 2 పరాజయలతో 71.43 విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మూడో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉంది. కానీ ఈ విజయంతో ఇరు జట్ల స్థానాలు తారుమారయ్యాయి. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది….

స్కోర్లు..

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 329 ఆలౌట్(మార్క్యూ అకెర్‌మన్ 95)

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 429 ఆలౌట్(జోష్ ఇంగ్లీస్ 102)

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 387 ఆలౌట్( ర్యాన్ రికెల్టన్ 101, వియాన్ మల్డర్ 115)

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 111 ఆలౌట్( సిమన్ హర్మర్ 6/16).