న్యూఢిల్లీలోని ‘ఇండియా-ఇజ్రాయెల్ సెంటర్’ నిర్వహించిన తాజా అధ్యయనంలో.. భారతీయుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో రష్యా, ఇజ్రాయెల్‌లు అగ్రస్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి ఐదు కీలక రాష్ట్రాల్లోని దాదాపు 42 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తూ 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులపై ఈ సర్వే నిర్వహించారు.
సంక్షోభ సమయాల్లో భారత్‌కు అండగా నిలిచే దేశాల్లో రష్యా తిరుగులేని మొదటి స్థానంలో నిలవగా, 57% మంది మద్దతుతో ఇజ్రాయెల్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 62% మంది యువత ఇజ్రాయెల్‌ను భారత్‌కు అత్యంత మంచి మిత్రదేశంగా గుర్తించారు. దేశ ప్రజల నమ్మకం విషయంలో రష్యా, జపాన్‌లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, 57% మంది విశ్వాసంతో ఇజ్రాయెల్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రేసులో అమెరికా, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కంటే చాలా వెనుకబడిపోవడం గమనార్హం.