*బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం: యూపీ మాజీ సీఎం అఖిలేశ్*
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అశిలేశ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్కు అఖిలేశ్ యాదవ్ కృతజ్ఞతలు చెప్పారు. ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్న అఖిలేశ్ యాదవ్.. ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతిపక్ష నేతలను బీజేపీ బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు.