ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతాంగానికి చుక్క నీరు అందకముందే అంచనా వ్యయా న్ని ఐదు రెట్లకు పెంచారు..కేటీఆర్..

కోడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకం ( Lift Irrigation ) టెండర్లలోనూ మంత్రి పొంగులేటి ( Minister Ponguletis ) కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ( KTR ) సోషల్‌ మీడియా వేదిక ద్వారా ఆరోపించారు. మంత్రి పొంగులేటి సొంత కంపెనీ టెండర్లలో పాల్గొని, మిగతా కంపెనీలన్నీ నామమాత్రపు పోటీదారులేనని విమర్శించారు.రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతాంగానికి చుక్క నీరు అందకముందే అంచనా వ్యయా న్ని ఐదు రెట్లకు పెంచారని వెల్లడించారు. ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నారని విమర్శిం చారు.

2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ, టెండర్ల ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. టెండర్లలో పారదర్శకతకు తావులేకుండా, తమకు అనుకూలమైన కంపెనీలకే పనులు దక్కేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు.

ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ అనే పదాలు కూడా సరిపోవని అన్నారు.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి, ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, టెండర్ల ప్రక్రియలోనూ తమకు అనుకూలమైన కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు