చివరి క్షణంలో గెలిచిన భారత్…వర్షంతో గట్టెక్కిన భారత్..!

టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 4 పరుగుల తేడాతో గెలుపొందింది….ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టీ20 తరహాలోనే రెండో మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించింది…

135 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(0).. జాకబ్ డఫీ వేసిన రెండో ఓవర్‌లోనే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. బౌండరీతో జోరు కనబర్చిన కోహ్లీ(7) కూడా డఫీ మరుసటి ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ రాగా.. రోహిత్ శర్మ తనదైన శైలిలో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. కానీ అతన్ని కైల్ జెమీసన్ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో తొలి పవర్ ప్లేలో భారత్ 3 వికెట్లకు 40 పరుగులే చేసింది..

వర్షం కారణంగా గంట ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. అంపైర్లు ఆటను 47 ఓవర్లకు కుదించారు. భారత బ్యాటింగ్ సందర్భంగా వర్షం మరోసారి అంతరాయం కలిగించగింది. వర్షం ఎంతకు తగ్గకుపోవడం.. డీఎల్‌ఎస్ లెక్కన భారత్ 4 పరుగులు అదనంగా చేయడంతో అంపైర్లు విజేతగా ప్రకటించారు..ఈ మ్యాచ్‌లో మందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్(104 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(38 బంతుల్లో ఫఓర్, 2 సిక్స్‌లతో 31) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్(4/30), అన్షూల్ కాంబోజ్(2/25), ఆకిబ్ నబీ(2/31), అక్షర్ పటేల్(2/28) రెండేసి వికెట్లతో సత్తా చాటారు.అనంతరం భారత్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 26 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), రోహిత్ శర్మ(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23), కేఎల్ రాహుల్(38 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 నాటౌట్) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(3/35), జాకోబ్ డఫీ(3/35) మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిషర్(1/23) ఒక వికెట్ పడగొట్టాడు…

ఛేదనలో కివీస్ బౌలర్ల షాక్.. ఆదుకున్న డీఎల్‌ఎస్ సమయం:

135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు న్యూజిలాండ్ బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లీ (7) త్వరగానే నిష్క్రమించగా, క్రమంగా వికెట్లు కోల్పోయి టీమిండియా 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అప్పటికే భారత్ డీఎల్‌ఎస్ స్కోర్ కంటే 4 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోవడంతో విజయం భారత్‌నే వరించింది. ఈ త్రిల్లింగ్ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది..