మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు..?..ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని, కొడంగల్‌కు రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు కేటాయించినట్లే.. మునుగోడుకు కూడా తగినన్ని నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

*ప్రజలు ఏం పాపం చేశారు..?!*
మునుగోడుకు నిధులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించిన ఆయన, ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారని నిలదీశారు. మునుగోడు అభివృద్ధి కోసం తాను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలను చాలాసార్లు కలిశానని తెలిపారు. శాసనసభ్యుల నియోజకవర్గాల పట్ల ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకూడదని హితవు పలికారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మునుగోడుకు తక్షణమే ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.