బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం…వాతావరణ శాఖ

నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, యానాంతో పాటు తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి..తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో.. ఈ వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే విధంగా అక్కడక్కడ పిడుగులు, గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. మరోవైపు, తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి…