కేటీఆర్‌పై అభిమానంతో కుమారుడికి ‘శివాన్ష్ తారక్ యాదవ్’ అని పేరు
– కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సిమర్ల జగదీశ్వరి శ్రీను యాదవ్ దంపతులు
చింతపల్లి………
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పై ఉన్న అభిమానంతో చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సిమర్ల శ్రీను యాదవ్, జగదీశ్వరి దంపతులు తమ కుమారుడికి ‘శివాన్ష్ తారక్ రామ్ యాదవ్’ అని పేరు పెట్టుకున్నారు.
కేటీఆర్ పై తమకున్న అభిమానం, ఆరాధనకు గుర్తుగా కుమారుడికి తారక్ పేరు పెట్టుకున్నామని వారు తెలిపారు.గత ఆరు సంవత్సరాలుగా కేటీఆర్ ని ప్రత్యక్షంగా కలిసి తమ అభిమానాన్ని తెలియజేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని, ఎట్టకేలకు ఈ రోజు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తమ కుమారుడికి కేటీఆర్ పేరు పెట్టుకోవడం వెనుక ఉన్న అభిమానాన్ని వివరించగా, కేటీఆర్ ని కలవడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని, మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చిందని సిమర్ల జగదీశ్వరి శ్రీను యాదవ్ దంపతులు తెలిపారు.
అభిమానం మాటల్లోనే కాదు… తమ బిడ్డ పేరులోనూ నిలిచిపోయేలా చేసిన సిమర్ల శ్రీను యాదవ్ కుటుంబం ఈ భేటీని జీవితంలో మరిచిపోలేని మధురానుభూతిగా భావిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,పల్లా ప్రవీణ్ రెడ్డి,చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు అండేకార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.