ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం..
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఆయన సతీమణి అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఉమ్మడి లేఖ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది…అయితే, ఈ అధికారిక విడాకుల ప్రకటన వెలువడటానికి ముందే దీనికి సంబంధించిన కీలక పరిణామాలు జరిగాయనే సరికొత్త విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయని, ఈ క్రమంలోనే వారు విడాకులు తీసుకోవాలనే తుది నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది…..
ముఖ్యంగా అన్నా లెజినోవాకు ఎంతో యాక్టివ్‌గా ఉండే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, కామెంట్లు మరియు నెటిజన్ల ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికే ఆమె ముందస్తుగా ఈ జాగ్రత్త పడినట్లు అర్థమవుతోంది. దాదాపు రెండు వారాల క్రితమే ఈ విడాకుల స్క్రిప్ట్ సిద్ధమయిందని, అంతా అనుకున్నట్లుగానే ఆమె రష్యా చేరిన తర్వాతే ఇరు పక్షాలు సంయుక్తంగా అధికారిక ప్రకటనను ప్రెస్‌కు విడుదల చేశాయని రాజకీయ, సినీ వర్గాల్లో గట్టిగా చర్చ సాగుతోంది…
పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అలాగే తమ పిల్లల సంతోషం, భవిష్యత్తు, సంక్షేమమే తమకు ఎప్పటికీ ముఖ్యమని తెలిపారు…..
సింగపూర్‌లో ఉన్నత విద్య.. హోటల్ వ్యాపారం!..
ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం.. అన్నా లెజినోవా 2024లో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. అంతేకాకుండా హాస్పిటాలిటీ రంగంలోనూ ఆమెకు మంచి గుర్తింపు, సింగపూర్‌లో కొన్ని హోటళ్లను కలిగి ఉన్నారు. రష్యా, సింగపూర్లలో ఆమెకు సుమారు రూ.1,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు..
ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా హుందాగా స్పందించింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందనేది ఆ ప్రకటన సారాంశం.
“ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత విషయానికి సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు గమనించాము. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. కాబట్టి సంబంధిత వ్యక్తుల గోప్యతను గౌరవించాలి. బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు విచక్షణ పాటించాలి. ఈ విషయంలో పార్టీ నేతలు, ప్రతినిధులు, కేడర్, సోషల్ మీడియా కార్యకర్తలు కొన్ని సూచనలు పాటించాలి” అని ఆ ప్రకటనలో పేర్కొంది.
సాధారణంగా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ట్రోలింగ్స్ జరిగే ప్రస్తుత రాజకీయాల్లో పవన్ విషయంలో వైసీపీ, టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త, ఆరోగ్యకరమైన సంప్రదాయానికి తెరలేపినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉంటూ, విధానపరమైన అంశాలపైనే దృష్టి సారించాలనే సందేశాన్ని ఈ పార్టీలు తమ కేడర్‌కు బలంగా పంపినట్లయింది..