విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్..!

HYD: విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్..

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో జరిగిన కార్యక్రమం
పారాయణంలో పాల్గొన్న 5 వేల మందికిపైగా భక్తులు
గిన్నిస్ రికార్డ్ నమోదుపై హర్షం వ్యక్తం చేసిన..
మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు
చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షణలో విరాట్‌ పారాయణం
యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా విరాట్‌ పారాయణం..

శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్రం (పుట్టినరోజు) మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో (Statue of Equality) నవంబర్ 10, 2026న భారీ ఎత్తున నిర్వహించిన సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం “గిన్నిస్ వరల్డ్ రికార్డ్” సృష్టించడానికి సిద్ధమైంది. “విశ్వశాంతి విరాట్ పారాయణం” పేరిట నిర్వహించిన ఈ మహత్తర కార్యక్రమంలో దాదాపు 10 వేల మందికి పైగా భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఏకకాలంలో భక్తిశ్రద్ధలతో పారాయణం చేశారు…ఎంతమంది చేశారన్నది కాదని, మనసుతో చేయాలన్నారు. ఎంతోమందికి ఈ కార్యక్రమం ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఆర్మీలో ఆత్మస్థైర్యం నింపాలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. మన దేశ యువతకు ప్రోత్సాహం అందిస్తే ఎన్నో విజయాలను సాధించగలరని చెప్పారు. అలాంటి యువతను కాక్రోచ్‌లు అని రకరకాల పేర్లు పెట్టి తప్పుదారిలో తీసుకువెళుతున్నారని చెప్పారు. యువతను అలా చేస్తున్నవాళ్లను మేధావులు అనాలో మధం ఎక్కినవాళ్లు అనాలో అర్థం కావట్లేదన్నారు. చీకటి పోవాలని, మేధాశక్తి వాళ్లలో రావాలన్నారు.