భారత్ సమ్మిట్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు…!

70 దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నవంబర్ 13, 14 తేదీలలో హైదరాబాద్‌లో రెండవ భారత్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. గత సమ్మిట్‌లో రూ. 30 కోట్ల వ్యయం జరిగిందన్న వార్తలు, వివాదాలపై విమర్శల నడుమ ఈ కార్యక్రమం తిరిగి జరుగుతోంది…

భారత్ సమ్మిట్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు
ప్రభుత్వసొమ్ముతో పార్టీకార్యక్రమం ఎలానిర్వహిస్తారు
దేశంపై విషం చిమ్మే శక్తుల కోసం సదస్సు-కిషన్‌రెడ్డి..

భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్
భారతఅభివృద్ధి, రాజ్యాంగ వ్యవస్థలను నాశనంచేసే కుట్ర
మోదీపై తప్పుడు ఆరోపణలకు భారత్ సమ్మిట్ వేదిక
భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ పనిచేస్తున్నారు
రాహుల్‌గాంధీ విజన్ ఏంటో చెప్పాలి అన్నారు…

దేశంలో పెట్టుబడులను అడ్డుకునేందుకే భారత్ సమ్మిట్
దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం తగ్గాయి..

పేదరికం, కులమత రాజకీయాలు తగ్గాయి
దేశ అభివృద్ధిని రాహుల్ ఏనాడు అభినందించలేదు
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై రాహుల్ మాట్లాడాలి
భారత్ సమ్మిట్‌లో జవాబు చెప్పాలి అన్నారు..

రేవంత్ అసమర్థత, విజన్ లేని రాహుల్ డైరెక్షన్‌
కాంగ్రెస్ తీరుతో తెలంగాణఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం
ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు
అన్నివర్గాలను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది అని విమర్శలు గుపించారు..

పెట్టుబడుల సదస్సు ముసుగు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే సదస్సు అని చెబుతూ, విదేశీ రాజకీయ ప్రతినిధులను పిలిచి కేంద్ర ప్రభుత్వంపై, భారత్‌పై వ్యతిరేక ప్రచారం చేసే వేదికగా హైదరాబాద్‌ను వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు..