భారత్కు వచ్చే హక్కు లేదు హెలె లింగ్ స్వెండ్సెన్ వీసా రద్దు…. ప్రధానులు, విదేశాంగ మంత్రులు వచ్చినా చాలా అతి చేస్తుంటారు. ఇటీవల నార్వేలో పర్యటించిన మోడీ, జైశంకర్ లను అవమానించేలా మాట్లాడింది అక్కడి ఓ లేడి జర్నలిస్టు. భారత్ లో హక్కులు కాలరాస్తున్నారంటూ నానా హంగామా సృష్టించింది. ఆమె గుర్తిందిగా.. ఇప్పుడు భారత్ పర్యటనకు ఆమెకు వీసా ఇచ్చి మరీ రద్దు చేసి మోడీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చేసింది. మన దేశానికి వచ్చి మనపైనే నిందలు వేసే ఇలాంటి అహంకార పూరిత జర్నలిస్టులను దేశంలోనే పాల్గొనకుండా మోడీ సర్కార్ మంచి పనిచేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’లో పాల్గొనేందుకు నార్వేకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్కు మంజూరైన వీసా చివరి నిమిషంలో రద్దు కావడం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలు, వీసా విధానాల ప్రకారం.. ఏ దేశానికైనా తన భూభాగంలోకి విదేశీ పౌరుల ప్రవేశాన్ని నియంత్రించే పూర్తి సార్వభౌమాధికారం ఉంటుంది. వీసా జారీ అయినంత మాత్రాన దేశంలోకి ప్రవేశానికి సంపూర్ణ హామీ లభించినట్లు కాదు. దేశ అంతర్గత భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పుడైనా వీసాలను సమీక్షించి రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. గతంలో భారత్కు సంబంధించిన అంశాలపై ర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్ విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని కేంద్రంలోని హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి..
వివాదానికి అసలు కారణం ఈ లేడి జర్నలిస్టు దుందుడుకు వైఖరే.. నార్వేలో ప్రధాని మోడీ పర్యటించిన సమయంలో ఈ అమ్మగారు హెలె లింగ్ వార్తల్లో నిలిచారు. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత్ లో హక్కులు కాలరాస్తున్నారంటూ ఆమె నేరుగా మోడీని ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ప్రధాని సమాధానం ఇవ్వకుండానే మీడియా సమావేశం నుంచి వెళ్లిపోవడం.. ఈమె అరుస్తూ ప్రశ్నించడం అప్పట్లో వైరల్ గా మారింది.
ఇప్పుడు అదే జర్నలిస్టు హైదరాబాద్ లో నిర్వహించే సమావేశానికి హాజరుకానున్న వేళ వీసా ఇచ్చి మరీ రద్దు చేసి కేంద్రం తగిన శాస్తి చేసిందని పలువురు అంటున్నారు. నోరు ఉంది కదా అని.. విదేశాల్లో మన దేశాన్ని, ప్రధానిని తక్కువ చేసి మాట్లాడే ఇలాంటి జర్నలిస్టులకు మన దేశంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వకపోవడం మంచిదని.. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందన్న చర్చ మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది…. ఈరోజు దేశాల మధ్య సంబంధాలు సంబంధించిన వ్యవహారంపై చర్చలు కొనసాగుతున్న వేళ జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్ చేసిన వ్యవహార శైలి ట్రోల్ గా మారాయి..
ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల వల్లే తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ఈ వీడియోను ఆ శాఖ మంత్రి అమిత్ షా కు ట్యాగ్ చేశారు. చివరి నిమిషంలో ఎందుకు వీసాను రద్దు చేయాల్సి వచ్చిందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ముందుగానే వీసా ఇవ్వకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక రద్దు కావడం, ఈ విషయంలో ఏకంగా హోమ్ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు…
గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వేలో పర్యటించినప్పుడు హెల్లె లింగ్ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత్ కు సంబంధించిన ఓ అంశంపై ఆమె నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇవ్వకుండా ప్రెస్ మీట్ నుంచి బయటికెళ్లిపోయారు. ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున డిబేట్స్ కు దారి తీసింది అప్పట్లో. ఆ కారణంతోనే హెల్లె లింగ్ విసా రద్దయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి..