నేటి పంచాంగం. రాశి ఫలాలు…

నేటి పంచాంగం. రాశి ఫలాలు...

తేది : 3, ఏప్రిల్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న ఉదయం 12 గం॥ 3 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 42 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న ఉదయం 11 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 40 ని॥ వరకు)
యోగము : వైదృతి
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 8 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 1 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 44 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 28 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 56 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 9 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : మేషము

మేషం🐐
గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
అదృష్ట సంఖ్య 2

వృషభం🐂
జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.
అదృష్ట సంఖ్య 1

మిథునం👫
ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.
అదృష్ట సంఖ్య 8

కర్కాటకం🦀
బంధు మిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
అదృష్ట సంఖ్య 3

సింహం🦁
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం.
అదృష్ట సంఖ్య 1

కన్య👧
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాల్లలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది.
అదృష్ట సంఖ్య 8

తుల⚖️
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి మొండి బాకీలు వసూలవుతాయి. పాత రుణాలు కొన్ని తీర్చగలుగుతారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
అదృష్ట సంఖ్య 2

వృశ్చికము🦂
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొంత ఆశ్చర్యపరుస్తాయి చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
అదృష్ట సంఖ్య 4

ధనస్సు🏹
ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.
అదృష్ట సంఖ్య 1

మకరం🐊
చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి.
అదృష్ట సంఖ్య 9

కుంభం⚱️
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
అదృష్ట సంఖ్య 7

మీనం🐟
అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
అదృష్ట సంఖ్య 5