వీసీ సజ్జనార్‌ ఉద్వాసన…నూతన కొత్వాల్‌గా మహేశ్‌ ఎం భగవత్‌కు ఆ బాధ్యతలు..!

: హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌కు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనను సీపీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ.. నూతన కొత్వాల్‌గా మహేశ్‌ ఎం భగవత్‌కు బాధ్యతలు అప్పగించింది. దీంతోపాటు ఇప్పటివరకూ లా అండ్‌ ఆర్డర్‌ బాధ్యతలు నిర్వర్తించిన మహేశ్‌ భగవత్‌ స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న ఏడీజీ అకుల్‌ సభర్వాల్‌ను శాంతిభద్రతల డీజీగా నియమించింది. వీరితోపాటు 21 మంది ఐపీఎస్‌ అధికారులకు బదిలీలు, నూతన పోస్టింగ్‌లు ఇస్తూ, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌ శాఖలోని కీలక విభాగాలతోపాటు జైళ్లు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), మహిళా భద్రత, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ట్రాఫిక్‌, రోడ్డు భద్రత, సివిల్‌ సైప్లె తదితర విభాగాల్లో భారీగా మార్పులు చేపట్టింది….

నూతన హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్. 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్ హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఆయన రాష్ట్ర శాంతిభద్రతల విభాగం డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేశారు. గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.