మేయర్, చైర్మన్ అభ్యర్థులను ఖరారు..
జనసేన 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ఖరారు..
Janasena Finalizes Mayor and Chairperson Candidates …
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కీలకమైన 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలకు సంబంధించిన మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను జనసేన అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా స్థానిక సమీకరణాలు, గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని ఈ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణి, కాకినాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవాని, భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పాలురు వెంకటేశ్వర రావు, రాజాం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్య లత పేర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది..
శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా డా.దానేటి రాధారాణి.
కాకినాడ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవాని ఖరారు.
రాజాం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సౌజన్యలత.
భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డా.మల్లేశ్వరి.
తాడేపల్లిగూడెం చైర్మన్ అభ్యర్థిగా వెంకటేశ్వరరావు..