బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం., తుఫాన్ కు క్వాన్‌గా నామకరణం..

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.

తీవ్ర తుఫాన్‌గా బలపడి తీరంవైపు కదిలే అవకాశం.

తుఫాన్‌గా మారాక అక్వాన్‌గా నామకరణం.

ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా మారే ఛాన్స్
18 ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం
ఏపీ కోస్తా తీరం వైపు తుఫాన్‌ పయనం
రేపటికి వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
20వ తేదీన తీరం దాటే అవకాశం ఉందన్న అధికారులు
ఈ నెల 18 నుంచి ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన..

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడవచ్చు. అలాగే విశాఖపట్నం, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడవచ్చు. ప్రస్తుతం భారీ వర్షాలకు ఎటువంటి సూచనలు లేవు. నవంబర్ 19 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎటువంటి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయలేదు.

తెలంగాణలో నవంబర్ 19 ఉదయం వరకు పొడి వాతావరణం ఉంటుంది. రాబోయే కొన్ని రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉదయపు వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది.