టర్కీ అనుసరించిన పక్షపాత వైఖరిపై భారతదేశం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం..!

ఐక్యరాజ్యసమితి మరియు ఇస్లామిక్ సహకార సంస్థ (OIC) మధ్య సహకారంపై ముసాయిదా తీర్మానంపై సంప్రదింపుల నుండి న్యూఢిల్లీ మరియు ఇతర సభ్య దేశాలను మినహాయించడానికి టర్కీ తీసుకున్న “బహిరంగ మరియు ఉద్దేశపూర్వక” చర్యను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది మరియు సాధారణ సభలో ఆ ముసాయిదాకు వ్యతిరేకంగా ఓటు వేసింది..

(UN) వేదికపై టర్కీ అనుసరించిన పక్షపాత వైఖరిపై భారతదేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది..ఐక్యరాజ్యసమితి , ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) మధ్య సహకారానికి సంబంధించిన ముసాయిదా తీర్మానంపై జరిగిన సంప్రదింపుల నుంచి భారత్‌తో పాటు మరికొన్ని సభ్య దేశాలను టర్కీ ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టడంపై న్యూఢిల్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇరాక్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి టర్కీ మధ్యవర్తిగా (ఫెసిలిటేటర్) వ్యవహరించగా, 112 దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. అయితే భారత్‌తో పాటు అమెరికా, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయగా, 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఇది పొరపాటు కాదు, పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర: యోజన పటేల్ ఫైర్

ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి రాయబారి యోజన పటేల్ ఈ అంశంపై మాట్లాడుతూ టర్కీ , ఓఐసీ తీరును ఎండగట్టారు. తీర్మానానికి సంబంధించిన వరుస ముసాయిదాలను పంపిణీ చేసేటప్పుడు భారత ప్రతినిధి బృందంతో పాటు పలు ఇతర దేశాలను ఓఐసీ శాశ్వత పరిశీలక మిషన్ కావాలనే మినహాయించిందని ఆమె ఆరోపించారు. కనీస నిబంధనలను సైతం తుంగలో తొక్కుతూ, కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా వాటిని సంప్రదింపుల్లో చేర్చకపోవడం చూస్తుంటే, ఇది పొరపాటున జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో చేసిన పని అని స్పష్టమవుతోందని మండిపడ్డారు. కేవలం ఒక సాంకేతిక మార్పుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సార్వభౌమ సమానత్వం , అందరినీ కలుపుకుపోయే ఐరాస మౌలిక సూత్రాలకు ఇది విరుద్ధమని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సర్వసభ్య సమావేశ అధ్యక్షుడు తక్షణమే విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత్ డిమాండ్ చేసింది…

భారత్‌కు మద్దతు నిలిచిన యూరోపియన్ యూనియన్, అమెరికా..

టర్కీ వ్యవహరించిన తీరుపై కేవలం భారత్ మాత్రమే కాకుండా యూరోపియన్ యూనియన్ (EU) , ఇతర దేశాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. సంప్రదింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, తమను కావాలనే చర్చల నుంచి దూరం పెట్టారని సైప్రస్ , గ్రీస్ ప్రతినిధులు మండిపడ్డారు. యూరోపియన్ యూనియన్ తరఫున ఐర్లాండ్ మాట్లాడుతూ, తాము చేసిన సూచనలు, సవరణలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండానే ముసాయిదాలను ఖరారు చేశారని విమర్శించింది. భవిష్యత్తులోనైనా వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి, ఏకాభిప్రాయం కుదిరే సహకార రంగాలపై మాత్రమే దృష్టి సారించాలని అమెరికా సూచించింది. మొత్తంమీద తీర్మానం ఆమోదం పొందినప్పటికీ, టర్కీ , ఓఐసీల ఏకపక్ష వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టడంలో భారత్ సఫలమైంది..

ఇరాక్ ప్రవేశపెట్టిన ‘ఐక్యరాజ్యసమితి మరియు ఇస్లామిక్ సహకార సంస్థ మధ్య సహకారం’ అనే ముసాయిదా తీర్మానాన్ని సోమవారం నాడు రికార్డు చేసిన ఓటింగ్ ద్వారా ఆమోదించారు. ఇందులో 112 దేశాలు అనుకూలంగా, ఆరు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా, 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి…అర్మేనియా, సైప్రస్, గ్రీస్, ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్‌తో పాటు భారతదేశం కూడా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. తుర్కియే ఈ తీర్మానానికి మధ్యవర్తిగా వ్యవహరించింది.

భారతదేశంతో పాటు, సైప్రస్, గ్రీస్ వంటి ఇతర దేశాలు కూడా ముసాయిదా చర్చల ప్రక్రియ అంతటా అంకారాలో “పారదర్శకత మరియు సమ్మిళితత్వం లోపించిందని” ఎత్తి చూపాయి.

తీర్మానం యొక్క వరుస ముసాయిదాలను పంపిణీ చేసేటప్పుడు, ఓఐసీ శాశ్వత పరిశీలకుల మిషన్ భారత ప్రతినిధి బృందాన్ని మరియు అనేక ఇతర దేశాలను మినహాయించాలని నిర్ణయించుకుందని ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి, రాయబారి యోజనా పటేల్ అన్నారు.