ప్రభుత్వానికి, తీర ప్రాంత ప్రజలకూ కంటి మీద కునుకు లేకుండా చేసిన అక్వాన్ తుపాన్ తీరం దాటడానికి రెండు రోజుల ముందే బాగా బలహీనపడింది..అక్వాన్ తుపాను తీవ్ర వాయుగుండంగా, అక్కడ నుంచి సాధారణ వాయుగుండంగా మారి తీరం దాటనుంది. ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20) నాటికి సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణ శాఖ తాజా అంచనా ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఉపగ్రహ విశ్లేషణల ప్రకారం, ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి 606 కిలోమీటర్లు, కాకినాడకు 624 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 673 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమూ ఉంది తుపాను స్థాయి నుంచి బలహీనపడిన ఈ వ్యవస్థలో ప్రస్తుతం గరిష్టంగా గంటకు 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ మార్పు వల్ల తుపాను బలం పూర్తిగా క్షీణించింది. దీని ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు, ఉరుములతో కూడిన మెరుపులు కేవలం సముద్రం పైనే కేంద్రీకృతమై ఉన్నాయి.
అయితే ఈ వాయుగుండానికి సంబంధించిన బాహ్య మేఘాల చారలు ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీర ప్రాంతాలను తాకాయి. దీనివల్ల తీరప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ అక్వాన్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి పెను విధ్వంసం సృష్టిస్తుందని హెచ్చరికలు జారీ కావడంతో తీరప్రాంత జిల్లాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కానీ ప్రకృతి అనుకూలించి భూభాగం నుంచి వీచిన పొడి గాలులు తుపాను శక్తిని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఉపగ్రహ విశ్లేషణల ప్రకారం, ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి 606 కిలోమీటర్లు, కాకినాడకు 624 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 673 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమూ ఉంది తుపాను స్థాయి నుంచి బలహీనపడిన ఈ వ్యవస్థలో ప్రస్తుతం గరిష్టంగా గంటకు 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. .