భారత్ ఆపరేషన్స్ సింధూర సమయంలో అద్భుత విజయాలు సాధించినట్లుగా ఓ నివేదిక వెల్లడించింది.. భారత్ ఒక తిరుగులేని మహాశక్తిగా ఎదుగుతుండటాన్ని చైనా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోందా? ప్రపంచ వేదికపై మన దేశం సాధిస్తున్న అద్భుత విజయాలు వెల్లడించింది..పెరుగుతున్న ప్రతిష్ట డ్రాగన్ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతోంది తాజాగా అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ విడుదల చేసిన సంచలన నివేదిక.
China’s military support to Pakistan during Operation Sindoor..
మన దేశ భద్రత, సార్వభౌమత్వానికి సవాల్ విసిరిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పొరుగు దేశమైన పాకిస్థాన్ వెనుక ఉండి చైనా నడిపిన చీకటి వ్యూహాలను ఈ రిపోర్ట్ కళ్లకు కట్టినట్లు బయటపెట్టింది. భారత్‌ను నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక.. మన చుట్టూ విషవలయాన్ని అల్లుతూ మన ప్రగతికి అడ్డుకట్ట వేయాలన్నదే బీజింగ్ అసలు కుట్ర అని ఈ నివేదిక స్పష్టం చేసింది.
నేడు భారత్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తిగా.. సాంకేతికతలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న దేశంగా మారింది. అమెరికా వంటి అగ్రరాజ్యాలతో భారత్ పెంచుకుంటున్న బలమైన స్నేహబంధం చైనాకు మింగుడుపడటం లేదు. ఆసియాలో తన ఏకఛత్రాధిపత్యానికి భారత్ రూపంలో బలమైన పోటీ ఎదురవుతుండటంతో డ్రాగన్ ఆందోళన చెందుతోంది. అందుకే మన దేశాన్ని కట్టడి చేసేందుకు చైనా కుటిల మార్గాలను ఎంచుకుంది. సరిహద్దుల్లో సైనిక బలగాలను పెంచడం.. పారిశ్రామిక సరఫరా గొలుసులపై ఒత్తిడి తేవడం.. మన పొరుగు దేశాలను మనకు వ్యతిరేకంగా ఉసిగొల్పడం వంటి చర్యలకు పాల్పడుతోందని అమెరికా ప్యానెల్ కుండబద్దలు కొట్టింది…ఆపరేషన్ సిందూర్ ఉద్రిక్తతల సమయంలో చైనా ప్రదర్శించిన ద్వంద్వ వైఖరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ పోరాటంలో చైనా నేరుగా బరిలోకి దిగకపోయినా తెర వెనుక ఉండి పాకిస్థాన్‌కు భారీ ఎత్తున సైనిక, సాంకేతిక సహకారం అందించిందని అమెరికా నివేదిక తేల్చి చెప్పింది. పాకిస్థాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు చైనా తన వంతు సాయం చేసిందని పేర్కొంది. భారత్‌పై నిరంతరం ఒత్తిడి కొనసాగించేందుకు పాకిస్థాన్‌ను ఒక పావుగా వాడుకుంటూ దక్షిణాసియాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్నదే డ్రాగన్ దురాలోచన అని ఈ రిపోర్ట్ విశ్లేషించింది..
చైనా రహస్య సాయానికి బలం చేకూర్చే మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహాయం అందించినట్లు చైనాకు చెందిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఇంజినీర్ స్వయంగా వెల్లడించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. శత్రుదేశానికి అండగా నిలిచిన డ్రాగన్ అసలు స్వరూపం ఈ ఒక్క సాక్ష్యంతో బట్టబయలైంది.
చైనా పన్నుతున్న ఈ వ్యూహాత్మక ఉచ్చును తిప్పికొట్టాలంటే భారత్ తన మిత్రదేశాలతో కలిసి మరింత బలంగా ముందుకు సాగాలని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ సూచించింది. ముఖ్యంగా అమెరికాతో నిఘా సమాచార మార్పిడి.. సముద్ర భద్రత.. రక్షణ రంగంలో ఉమ్మడి తయారీని పెంచుకోవడం అత్యవసరమని పిలుపునిచ్చింది..
మరోవైపు గతంలో కూడా చాలా నివేదికల్లో చైనా సాటిలైట్ ద్వారా భారత్ కదలికలను పాటిస్తాను అందించినట్లుగా వార్తలు వెలువడటం జరిగింది..