శ్రీశైలం విషయంలో తమిళనాడు వాళ్ళు చేసినట్లు రేపు నాగార్జున సాగర్ విషయంలో ఏపీ వాళ్ళు కూడా అలానే చేస్తారు…మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

శ్రీశైలం విషయంలో తమిళనాడు వాళ్ళు చేసినట్లు రేపు నాగార్జున సాగర్ విషయంలో ఏపీ వాళ్ళు కూడా అలానే చేస్తారు.

శ్రీశైలం నుండి నీళ్లు తీయడానికి లేదు కానీ కావేరి నదికి సంబంధించిన నీటి పంపకంలో 50 ఏండ్ల కింద కృష్ణ నది నుండి 5 టీఎంసీల నీళ్లను చెన్నైకి ఇస్తానని కర్ణాటక ఒప్పుకుంది..

అయితే 5 టీఎంసీలు శ్రీశైలం దగ్గర ఉండడంతో ఇక్కడ నుండి ఇవ్వండని తమిళనాడు ప్రభుత్వం అడిగితే ఎవరు పట్టించుకోలేదు..

ఎన్టీఆర్ గారు సరే అని రోజుకు 1500 క్యూసెక్కుల నీళ్లు ఇస్తానని చెప్పారు.. కానీ ఇవాళ వాళ్ళు రోజు 80 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకుపోతున్నారు..

రేపు నాగార్జున సాగర్ విషయంలో ఏపీ వాళ్లు కూడా అలానే చేస్తారు..- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి కారణం రేవంత్ రెడ్డి మరియు నల్గొండ మంత్రులే

నాగార్జున సాగర్ వద్ద జలదోపిడికి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన ఉత్తరాన్ని బయటపెట్టాలి

మేము విషయం బయటపెట్టేంత వరకు మొద్దు నిద్రపోయి, ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు..