స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలోనే 3 వేల పరుగుల మైలురాయి అందుకున్న వికెట్ కీపర్‌గా నిలిచాడు..అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో రిషభ్ పంత్(153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 128) సెంచరీతో సత్తా చాటాడు. 55 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పంత్.. దూకుడుగా ఆడి 135 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు..
గిల్ తర్వాత పంత్..
ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 3000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. 2019లో ఈ టోర్నీ ప్రారంభం కాగా.. రిషభ్ పంత్ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్ 77 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. శుభ్‌మన్ గిల్ కూడా ఇదే టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించడం గమనార్హం…