పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు..!

ప్రస్తుత విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు నిర్వహించవల్సిన పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తాజా ప్రతిపాదనల మేరకు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు పరీక్ష ఫీజు చెల్లింపు…

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. మార్చి 17 లేదా మార్చి 18 నుంచి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు సమర్పించారు..ఇంటర్ పరీక్షలు మార్చి 16తో ముగియనున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ను ప్రభుత్వ ఆమోదానికి పంపారు. కాగా, ఏప్రిల్ 10వ తేదీకి పరీక్షలు పూర్తి చేసే విధంగా.. గతంలో అమలు చేసిన విధానాన్ని అమలు చేయనున్నారు. అదే విధంగా మార్కుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ విద్యా శాఖ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ సిద్దం చేసింది. మార్చి 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించేందుకు రూపకల్పన చేసిన టైం టేబుల్ ను ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించింది. మార్చి 16తో ఇంటర్ పరీక్షలు పూర్తి కానున్నాయి. దీంతో.. 18వ తేదీ నుంచి పది పరీక్షల నిర్వహణ పైన ఈ ప్రతిపాదన చేసింది. పరీక్షలు మొత్తం 24 రోజులు నిర్వహించి.. ఏప్రిల్ 10వ తేదీ ముగించేలా షెడ్యూల్ ప్రతిపాదించారు. పదో తరగతిలో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. సైన్స్ లో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రానికి వేర్వేరు పేపర్లు ఉంటాయి. విద్యార్ధుల పై ఒత్తిడి తగ్గించటానికి సీబీఎస్ఈ తరహాలో పరీక్షల వ్యవధిని పెంచారు. గత ఏడాది అమలు చేసిన విధానమే ఇప్పుడు అమలు చేస్తున్నారు.