హైదరాబాద్‌లోని హెరిటేజ్ ఫుడ్స్‌లో ప్రమాదం..

హైదరాబాద్‌లోని హెరిటేజ్ ఫుడ్స్‌లో ఘోర ప్రమాదం

ఉప్పల్ ఐడీఏలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో డ్రమ్ పేలి మహిళ మృతి

కంపెనీలో వ్యర్థాలను పారవేసేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా డ్రమ్ పేలడంతో పింకీ దేవి (36) అక్కడికక్కడే మృతి

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కంపెనీ ఎదుట ఆందోళనశనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో క్రేట్ వాషర్ వద్ద వ్యర్థాలను పారవేసేందుకు మొదటి అంతస్తులోని డ్రమ్ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్రమ్ పేలడంతో ఆమె తీవ్ర ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.మృతురాలు బీహార్‌కు చెందిన హరేంద్ర షా భార్య ఆమెకు రీసు, ప్రిన్స్, క్రియాంశ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారిన పరిస్థితి కుటుంబ సభ్యులను కలచివేస్తోంది.

కంపెనీ ఎదుట కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు ఆందోళన..

పింకీ దేవి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, తగిన పరిహారం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి…