మంగళవారం ఉదయం నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు భారత జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (NCS) వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:02 గంటలకు, భూమికి 20 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. సిక్కిం సరిహద్దుకు సమీపంలోని తూర్పు నేపాల్ ప్రాంతంలో (27.855° ఉత్తర అక్షాంశం, 87.909° తూర్పు రేఖాంశం వద్ద) భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది.
నేపాల్ భారత్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు..తూర్పు నేపాల్ కొండ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. ఈ భూప్రకోపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు తెలుస్తోంది.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 గా రికార్డయింది. నేపాల్లోని తాప్లేజంగ్, భారత్ లోని సిక్కింలో గల మంగన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. నేపాల్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:17 నిమిషాలకు 27.832 ఉత్తర అక్షాంశం, 87.946 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది…..ఈ భూకంప కేంద్రం సిక్కింలోని గెయిజింగ్ పట్టణానికి వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల దీని చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా నమోదయ్యాయి. దీని తీవ్రత పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్లోనూ కనిపించింది. గాంగ్టక్, గెయిజింగ్, డార్జిలింగ్, కుర్సియాంగ్, కాలింపాంగ్ తదితర కొండ ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించడంతో పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు…భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లలోని పాత్రలు, ఫర్నిచర్ తీవ్రంగా కదిలిపోవడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నేపాల్లోని పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలైన తారాయ్ జిల్లాల్లోనూ ప్రకంపనల ధ్వని స్పష్టంగా వినిపించిందని స్థానికులు వెల్లడించారు..
భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు తక్షణ సమాచారం అందలేదు. భూకంప తీవ్రత, కేంద్రానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, తదుపరి సమాచారం కోసం తమ అధికారిక భూకంప పర్యవేక్షణ వేదికను అనుసరించాలని ప్రజలకు సూచించింది. ఈ ప్రకంపనల ప్రభావంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..