ఉరి వేయాల్సింది రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు…!

తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు ఆ నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే మేము పోరాడాము..

రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆ నిర్ణయాల్లో మేము భాగస్వాములుగా ఉండదల్చుకోలేదని వెళ్లిపోయాము..

మీరు ఆ రోజు తెలంగాణ ఇస్తామని, రాష్ట్రపతితో ఉభయ పార్లమెంట్ సభలలో చెప్పించడం వల్ల, సోనియా గాంధీ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము క్యాబినెట్‌లో చేరాము..

తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పార్టీలో చర్చ జరిగితే వైదొలగాలని కేసీఆర్ ఆదేశిస్తే అర్ధరాత్రి అమెరికా నుండి ఫ్యాక్స్ పంపి మంత్రి పదవులను గడ్డి పూసల్లాగా త్యాగం చేసాము..

మేము రాజీనామా చేసిన తర్వాత 9 నెలలకు ఈ GOలు వచ్చాయి..

ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల మేము రాజీనామా చేసాము..

మేము విసిరేసిన ఎంగిలి పదవులు తీసుకొని పెదవులు మూసుకుంది మీరు..- హరీష్ రావు

తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతూ..

చిల్లరగా మాట్లాడే రేవంత్ రెడ్డికి చిల్లరగానే సమాధానం చెప్పాలి అని అన్నారు..నిన్న రేవంత్ రెడ్డి అతి తెలివితేటలు చూపిస్తూ అతిగా మాట్లాడాడు..

2024-25 సంవత్సరంలో కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 718 టీఎంసీలు వాడితే, తెలంగాణ 286 టీఎంసీలు వాడింది.. అంటే 28 శాతం నీళ్లు వాడారు..

తెలంగాణ తాత్కాలిక కేటాయింపు 34 శాతమైతే 28 శాతం వాడి పర్సెంటేజ్ దాచి పెట్టి 286 టీఎంసీలు అని చెప్పాడు..

2025-26లో ఆంధ్రప్రదేశ్ 771 టీఎంసీలు వాడితే, తెలంగాణ 267 టీఎంసీలు వాడింది..

అంటే 25 శాతం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ వినియోగం ఇది అన్నారు..

2024-25, 2025-26లో పర్సెంటేజ్ తక్కువగా ఉందని టీఎంసీలు మాట్లాడి, 2026లో పర్సెంటేజ్ ఎక్కువ ఉందని పర్సెంటేజ్ మాట్లాడుతూ అతి తెలివితేటలు చూపించాడు అని ఆరోపించారు..

ఉరి వేయాల్సింది రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని

ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్‌కు పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతుంటే కుంభకర్ణుడిలాగా నిద్రపోయినందుకు నిన్ను ఉరి వేయాలి

కల్వకుర్తిలో, శ్రీశైలంలో నీళ్లు ఉన్నా 24 గంటలు మోటార్లు నడపకుండా 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు పంపించినందుకు నిన్ను ఉరి వేయాలి

దేవాదులలో నీళ్లు ఉన్నా ఎత్తకుండా ఏపీకి నీ గురుదక్షిణగా చెల్లించినందుకు, వరంగల్ జిల్లాను కరువులోకి నెట్టినందుకు నిన్ను ఉరి వేయాలి

కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్ర మంత్రిని నిలదీశారు

7 ఏండ్లు అయినా ట్రిబ్యునల్ వేయడం లేదని.. కృష్ణా నదిలో తెలంగాణ వాటా మాకు కావాలని

మీరు నిర్ణయం తీసుకోకపోతే నేను సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చిందని కేసీఆర్ కేంద్ర మంత్రిని నిలదీశారు గుర్తు చేసేరు….అసలు తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు రావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీళ్లు చాలు అని ఒప్పుకున్న పాపాత్ములు మీరే కదా?

ఆనాడు సంతకాలు చేసింది ఈరోజు నీ పక్కన ఉన్న మంత్రులే రేవంత్ రెడ్డి

కానీ తెలంగాణ వచ్చిన 42 రోజులకే కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి ఆ 299 టీఎంసీల నీళ్లు కాకుండా ఇంకా 580 టీఎంసీల నీళ్లు కావాలని ఫిర్యాదు చేశాడు..

నిన్న KRMB మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ENC నరసింహ మూర్తి సమావేశంలో ఎక్కడా పల్నాడు ప్రాజెక్టు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని మీడియా సమక్షంలో చెప్పాడు

నిన్న రేవంత్ రెడ్డి అంతసేపు ప్రెస్ మీట్ పెట్టి నాగార్జున సాగర్ వద్ద జరుగుతున్న పల్నాడు ప్రాజెక్టును ఆపుతానని ఎక్కడా చెప్పలేదు

KRMB మీటింగ్‌లో ఈ పల్నాడు ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ ఇంజనీర్లు చెప్పలేదు

రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణలో భాగంగా ఈ పల్నాడు ప్రాజెక్టును ఒప్పుకున్నాడు

అందుకే రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడలేదు, తెలంగాణ ఇంజనీర్లు ప్రశ్నించలేదు …

అసలు కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసింది మీరే కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేరు..