భోగాపురం రోడ్డు ప్రమాదం .5 మంది మృతి..!

భోగాపురం ప్రమాదానికి ముందు సీసీ కెమెరాలో థార్ దృశ్యాలు.. మృతుల సంఖ్య 5కు

విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు చేరింది.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొండపు సూరిబాబు మృతి చెందారు

మృతులంతా విశాఖ జిల్లా తగరపువలస, మధురవాడ, భీమిలికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు

శ్రీముఖలింగం దర్శనం చేసుకుని విశాఖకు తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది

డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తులోకి జారడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు

ప్రమాదానికి ముందు థార్ కారు రహదారిపై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి..

భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రిలయన్స్ డిజిటల్ మేనేజర్ ఓకలపూడి శ్రీనివాస్, బోర సతీష్, శృతి, కుసుమ రంజనిగా గుర్తించారు. వీరంతా విశాఖ జిల్లా తగరపువలస పరిసర ప్రాంతాలకు చెందినవారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల బ్యాగుల్లో నగదు, విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గురైన థవేరా కారు అర్ధరాత్రి 12.50 గంటలకు శ్రీకాకుళం వైపు వెళ్లి, తిరిగి ఉదయం 7.35 గంటలకు భోగాపురం టోల్‌గేట్ దాటినట్లు రికార్డుల్లో నమోదైంది…