28 సిక్సర్లు, 7 ఫోర్లు, 53 బంతుల్లో 204 పరుగులు! వైభవ్ సూర్యవంశీ ‘తుఫాన్’ డబుల్ సెంచరీ…

28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. ఏకంగా 28 సిక్సర్లు..
7 ఫోర్లు.. స్టేడియం మొత్తం సిక్సర్ల వర్షం..
ప్రేక్షకులే ఫీల్డర్డు.. బౌలర్లకు పట్టపగలే చుక్కలు.. ఇంతకంటే ఏం చెప్పాలి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం గురించి.. బ్యాట్ పట్టి క్రీజ్‌లోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే.. బౌలర్ ఎవరైనా బంతి బౌండరీ దాటాల్సిందే..! ఈ బుడ్డోడి ఆట చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరుగుతున్న 28 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా 53 బంతుల్లో 204 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఏకంగా 28 సిక్సర్లు, 7 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో యూఏఈ విధించిన 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.2 ఓవర్లలోనే ఛేదించింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ హర్‌ప్రీత్ సింగ్ భాటియా (130) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ బాసిల్ హమీద్ (36) మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో అర్షద్‌ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, సూయన్ష్‌, హర్ష్‌ దూబే, షాబాద్ అహ్మద్ తలో వికెట్ తీశారు..

లక్ష్య ఛేదనలో వైభవ్ విధ్వంసంతో వార్ వన్ సైడ్ అయింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో యూఏఈ బౌలర్లకు ఈ రాత్రి కాళరాత్రిగా మార్చాడు. పేసర్ జాహిద్ అలీ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఆ తరువాత ఎక్కడా జోరు తగ్గించలేదు. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న వైభవ్.. మరో 12 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొదట 16 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. ఆ తరువాత కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాదాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డు అయింది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనత ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ పేరిట ఉండేది. అతడు 2023లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున టాస్మానియాపై 29 బంతుల్లో శతకం సాధించాడు. ఇప్పుడు వైభవ్ 28 బంతుల్లోనే సెంచరీ చేసి ఆ రికార్డును అధిగమించాడు.

అంతటితో ఆగకుండా 40 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆ తర్వాత 52వ బంతికి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బౌస్ పేరిట ఉండేది. 2024లో కాంటర్‌బరీ తరఫున ఒటాగోపై అతడు 103 బంతుల్లో ద్విశతకం సాధించాడు. ఇప్పుడు వైభవ్ కేవలం 52 బంతుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. భారత్ తరఫున గతంలో ఎన్.జగదీశన్ 114 బంతుల్లో 200 చేశాడు.