బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్ల ముప్పు…

ఆర్నబ్, మురుసు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆ తర్వాత ఆక్వాన్ తుఫాను గండం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..అయితే, ఇప్పుడు బంగాళాఖాతంలో ఒకటి కాదు ఏకంగా రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ నిపుణులు తాజా అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ నెలాఖరుతో పాటు డిసెంబర్ రెండో వారంలో ఈ తుఫాన్లు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు..

నెలాఖరున అల్పపీడనం.. డిసెంబర్ రెండో వారంలో మరో గండం

వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, ప్రస్తుత నవంబర్ నెలాఖరు నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇది క్రమంగా బలపడి తుఫానుగా మారి, డిసెంబర్ 4వ తేదీ తర్వాత శ్రీలంక మరియు దక్షిణ తమిళనాడు తీరాల దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అంతేకాకుండా, డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, దాని గమనంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.