డీలిమిటేషన్ బిల్లు
మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కేంద్రం రెండో ప్రయత్నం.. ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఉత్కంఠ……
డీలిమిటేషన్ అంటే ఏమిటి.
* డీలిమిటేషన్ అంటే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు, సంఖ్య, ప్రాతినిధ్యాన్ని పునర్వ్యవస్థీకరించడం.
* జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
* ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉండాలి, రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలి అనేది నిర్ణయించే ప్రక్రియ.
* జనాభా పెరుగుదల, ప్రాంతీయ ప్రాతినిధ్యం, ప్రజలకు సమాన ప్రాతినిధ్యం వంటి అంశాలు ఇందులో కీలకం.
* డీలిమిటేషన్ కమిషన్ ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది.
*• కేంద్ర ప్రభుత్వం ఎందుకు మళ్లీ బిల్లు తీసుకొస్తోంది.*
* మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కేంద్రం ప్రధాన లక్ష్యంగా చెబుతోంది.
* లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం.
* నియోజకవర్గాల పునర్విభజనతో పాటు పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.
* 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
* గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోవడంతో సవరణలతో కొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది.
*• కొత్త బిల్లులో కీలక ప్రతిపాదనలు.*
* లోక్‌సభ స్థానాలను గణనీయంగా పెంచే ప్రతిపాదన.
* ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న స్థానాలపై 50 శాతం అదనపు స్థానాలు కల్పించే ప్రతిపాదన.
* రాష్ట్రాల మధ్య ప్రస్తుత స్థానాల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించే ప్రతిపాదన.
* 2011 జనాభా లెక్కలను నియోజకవర్గాల పునర్విభజనకు ఉపయోగించాలనే ప్రతిపాదన.
* రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తి తగ్గకుండా చూడటమే కొత్త ప్రతిపాదనలో కీలక అంశం.
* మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
*🔹గత ఏప్రిల్‌లో జరిగిన ఘటన.*
* 2026 ఏప్రిల్ 16న లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టారు.
* ఏప్రిల్ 17న రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు.
* బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేశారు.
* బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు.
* మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
* బిల్లు ఆమోదం పొందాలంటే 352 ఓట్లు అవసరమయ్యాయి.
* అవసరమైన మెజార్టీ కంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయింది.
* రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై ముందుకు వెళ్లలేదు.
*• ఇప్పుడు బిల్లుకు మద్దతుగా ఉన్న పార్టీలు.*
* బీజేపీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన పార్టీ. బిల్లుకు పూర్తి మద్దతు.
* తెలుగుదేశం పార్టీ: ఎన్డీయే భాగస్వామిగా కేంద్ర ప్రతిపాదనకు మద్దతు.
* జనసేన: ఎన్డీయే కూటమిలో భాగంగా మద్దతు.
* జేడీయూ: నితీశ్ కుమార్ నేతృత్వంలోని పార్టీ ఎన్డీయేలో భాగస్వామి.
* శివసేన: ఏక్నాథ్ షిండే వర్గం మద్దతు.
* ఎన్సీపీ: అజిత్ పవార్ వర్గం ఎన్డీయేకు మద్దతు.
* లోక్ జనశక్తి పార్టీ: ఎన్డీయే భాగస్వామిగా మద్దతు.
* ఇతర ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కూడా బిల్లుకు మద్దతుగా ఉన్నాయి.
*• షరతులతో మద్దతు తెలిపే అవకాశం ఉన్న పార్టీలు.*
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
* లోక్‌సభలో 4 మంది ఎంపీలు.
* రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్యంలో అసమానతలు రాకూడదనేది ప్రధాన డిమాండ్.
* దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి రక్షణ ఉంటే మద్దతు ఇచ్చే అవకాశముంది.
DMK….
* లోక్‌సభలో 22 మంది ఎంపీలు.
* తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదని స్పష్టం చేస్తోంది.
* రాష్ట్రాల మధ్య ప్రస్తుత స్థానాల నిష్పత్తికి రక్షణ కల్పించాలని కోరుతోంది.
* కొత్త బిల్లు ముసాయిదాను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎన్సీపీ – శరద్ పవార్ వర్గం
* లోక్‌సభలో 8 మంది ఎంపీలు.
* రాష్ట్రాలన్నింటికీ సమానంగా 50 శాతం స్థానాల పెంపు ప్రతిపాదనకు సానుకూల సంకేతాలు.
* అయితే సుప్రియా సూలే బిల్లు పూర్తి ముసాయిదాను పరిశీలించిన తర్వాతే తుది వైఖరి ప్రకటిస్తామని తెలిపారు.
*• అదనపు మద్దతుపై రాజకీయ చర్చ.*
* తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయినట్లు చెబుతున్న కొందరు ఎంపీల మద్దతుపై చర్చ జరుగుతోంది.
* శిరోమణి అకాలీదళ్ ఎంపీ మద్దతు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.
* భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతు లభించవచ్చని కూడా కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
* చిన్న పార్టీల ఎంపీలు, స్వతంత్ర ఎంపీల మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
* అయితే ఈ మద్దతులన్నీ తుది ఓటింగ్‌లో నిర్ధారణ కావాల్సి ఉంది.
*• బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రధాన పార్టీలు.*
* కాంగ్రెస్
* సమాజ్‌వాదీ పార్టీ
* తృణమూల్ కాంగ్రెస్
* రాష్ట్రీయ జనతాదళ్
* సీపీఐ
* సీపీఎం
* శివసేన – ఉద్ధవ్ ఠాక్రే వర్గం
* ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గత ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
*🔹ప్రతిపక్షాల అభ్యంతరాలు.*
* జనాభా ఆధారంగా స్థానాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి నష్టం కలగవచ్చనే ఆందోళన.
* మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై అభ్యంతరం.
* నియోజకవర్గాల పునర్విభజనలో రాజకీయ ప్రయోజనాలు ఉండకూడదని డిమాండ్.
* రాష్ట్రాల మధ్య సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని పట్టుబడుతున్నాయి.
*🔹పార్లమెంట్లో మెజార్టీ లెక్కలు.*
* ప్రస్తుత లోక్‌సభలో మొత్తం ఆమోదిత స్థానాలు 543.
* మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 540.
* అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణకు 360 ఓట్లు అవసరం.
* ఎన్డీయేకు సుమారు 320 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తాజా రాజకీయ అంచనాలు.
* వైఎస్సార్సీపీ, డీఎంకే, శరద్ పవార్ వర్గాల మద్దతు లభిస్తే సంఖ్య 354 వరకు చేరే అవకాశం.
* అయినప్పటికీ పూర్తి హాజరు ఉంటే మరో 6 ఓట్లు అవసరం.
* ఇతర పార్టీల మద్దతు, గైర్హాజరు, ఓటింగ్‌కు దూరంగా ఉండే ఎంపీల సంఖ్య కీలకం కానుంది.
* రాజ్యసభలోనూ ప్రత్యేక మెజార్టీ సాధించాల్సి ఉంటుంది.
*🔹పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.*
* నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది.
* నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో లోక్‌సభ సమావేశాలు.
* డిసెంబర్ 2, 3 తేదీల్లో రాజ్యసభ సమావేశాలు.
* ఈ సమావేశాల్లో సవరించిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ ప్రతిపాదనలను ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
* బిల్లుకు రెండు సభల్లోనూ రాజ్యాంగపరమైన ప్రత్యేక మెజార్టీ అవసరం.
*🔹తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం.*
* రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం.
* ప్రస్తుత స్థానాలపై 50 శాతం పెంపు ప్రతిపాదన అమలైతే తెలుగు రాష్ట్రాలకు అదనపు ప్రాతినిధ్యం లభిస్తుంది.
* తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
* 50 శాతం పెంపు ప్రతిపాదన ప్రకారం తెలంగాణకు సుమారు 26, ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 38 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది.
* అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా ఇదే విధంగా పెంచే ప్రతిపాదన ఉంది.
* అయితే తుది స్థానాల సంఖ్య, నియోజకవర్గాల సరిహద్దులు అధికారిక చట్టం, డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే ఖరారవుతాయి.
*• దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు.*
* జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు గణనీయమైన పురోగతి సాధించాయి.
* ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందనే వాదన ఉంది.
* కేవలం జనాభా ఆధారంగా స్థానాలు కేటాయిస్తే ఉత్తరాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉందని దక్షిణాది పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
* పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందనే భయం వ్యక్తమవుతోంది.
* కొత్త బిల్లులో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా 50 శాతం స్థానాల పెంపు, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే ప్రతిపాదన ఈ ఆందోళనలను తగ్గించే ప్రయత్నంగా కనిపిస్తోంది.
*• మహిళా రిజర్వేషన్లతో సంబంధం.*
* 2023లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం ఆమోదమైంది.
* అయితే దాని అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టారు.
* ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్రం కొత్త రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తోంది.
* లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించాలనేది ప్రతిపాదన.