మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి.. సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు!

మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి.. సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు!..

“జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన 36 ఏళ్ల బక్కశెట్టి సింధూజ (తుషారిక) హైటెక్ సిటీలోని నెక్స్ట్‌టర్న్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. 2015లో పెళ్లయినా, ఏడాదిన్నరకే విడాకులు కావడంతో మియాపూర్‌లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగానే ఉంటోంది.”

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సింధూజ అలియాస్ తుషారిక (36) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆమె గత పదేళ్లుగా భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం.

గత నాలుగు నెలలుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 26న స్నేహితురాలు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

అసలు విషయం బయటకు వచ్చింది ఇలా..

“గురువారం ఉదయం సహోద్యోగి రాజీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సింధూజ స్పందించలేదు. అనుమానంతో ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్

అక్కడ దొరికిన సూసైడ్ నోట్ అందరినీ కదిలించింది. గత నాలుగు నెలలుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె రాసింది. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, తన బ్యాంకు ఖాతాలోని డబ్బును అనాథ పిల్లలకు ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా, కోర్టులో ఉన్న తన ఆస్తి కేసులను కొనసాగించి, ఆ ఆస్తి మొత్తాన్ని ‘కుర్ ట్రస్ట్’ కు అందజేయాలని చివరి కోరికగా రాసింది.”