లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్…

బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం… పోలీసులపై వేటు!

రెస్టారెంట్‌లో రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ ‌కు విందు భోజనం

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ

రిమాండ్ ఖైదీకి రెస్టారెంట్‌లో విందు భోజనం చేసేందుకు అవకాశం కల్పించిన పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. ఏకంగా ఏడుగురు పోలీసులను గుంటూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.

ఓ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో హజరు పర్చి తిరిగి తీసుకువెళుతుండగా, మార్గమధ్యంలో గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద అగి భోజనాలు చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు సెల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా, పోలీసులు వాళ్ల ఫోన్‌ లాక్కుని వీడియో డిలీట్ చేశారు.

అయినా రెస్టారెంట్‌లోని సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితుడు బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల విందు భోజనం అంటూ సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ చేయడంతో పోలీసు అధికారులు స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏడుగురు పోలీసులపై ఎస్పీ సతీశ్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు…

*రూ.కోటి లోన్.. 50 లక్షల సబ్సిడీ*

గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారులకు గుడ్ న్యూస్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా కేంద్రం లోన్‌లు ఇస్తోంది. రూ.కోటి వరకు లోన్ లభిస్తుంది. అర్హులైన వారికి రూ.50 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. యూనిట్‌లో 500 ఆడ మేకలు/గొర్రెలు, 25 మగవి ఉండాలి. స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రంతో ఈ పథకానికి అప్లై చేసుకోవాలి…

సముద్ర జలాల్లోకి నేడు పాంటూన్ వెసల్

AP: భారత నౌకాదళ అవసరాల నిమిత్తం హిందుస్థాన్షిప్యార్డులో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాంటూన్ వెసల్ ఈనెల 7న సముద్ర జలాల్లోకి వెళ్లనుంది. షిప్యార్డులో దీనిని నిర్మించేందుకు యాజమాన్యం ఎంతగానో శ్రమించింది. ఈ పాంటూన్ ఆర్డరు విలువ రూ.457కోట్లు. భారత నౌకాదళానికి చెందిన తేలికపాటి యుద్ధనౌకలు సముద్రంలో ఉండగా ఏమైనా సాంకేతికపర ఇబ్బందులు తలెత్తితే వాటికి అత్యవసర మరమ్మతులు చేసేందుకు పాంటూన్ వెసల్ దోహదపడనుంది..

సచివాలయంలో వాస్తు మార్పులు!

HYD : రాష్ట్ర సచివాలయంలో వాస్తు ప్రకారం పలు మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం తూర్పుదిశగా ఉన్న సచివాలయ ప్రధాన మహా ద్వారం ఈశాన్యంవైపునకు మారనుంది. దీంతోపాటు ప్రస్తుతం సచివాలయంలోని ఆగ్నేయంవైపు ఉన్న గేటు నంబర్-2నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపున్న గేటు నంబర్-4వరకు నేరుగా వెళ్లేలా రహదారిని నిర్మిస్తున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చేస్తున్నారు…

తిరుమల శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్

తిరుమలలోని శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ నూతన చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.

డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర అన్న ప్రసాదం కార్యాకలాపాలను చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒకరోజులో ఎంతమంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు, అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్న ప్రసాద భవనం పని చేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు..

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ పౌరసత్వంపై అలహాబాద్‌ హైకోర్టులో పిల్.

*కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ పౌరసత్వంపై అలహాబాద్‌ హైకోర్టులో పిల్ దాఖలైంది.* ఈ పిల్ పై సీబీఐ విచారణ ప్రారంభమైంది. *ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ మరియు జస్టిస్ తుషార్ రావు గేదెల డివిజన్ బెంచ్ ముందు వర్చువల్ గా హాజరయ్యారు.* అలహాబాద్‌లో పిఐఎల్ దాఖలు చేసిన కర్ణాటకకు చెందిన బిజెపి నేత విఘ్నేష్ శిశిర్ రాహుల్ గాంధీపై తాను గతంలో చేసిన ఫిర్యాదుపై స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. గాంధీ భారత పౌరుడిగా ఉన్నప్పుడు, బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆరోపించడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ను ఉల్లంఘించినట్లు అవుతుందని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను తాను సీబీఐకి అందించానని, అలహాబాద్‌లో దాఖలు చేసిన తన పిల్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందని పేర్కొన్నారు శిశిర్. కాగా.. ఇంప్లీడ్‌మెంట్ కోసం దరఖాస్తుతో పాటు రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బెంచ్ శిశిర్‌ను ఆదేశించింది…

రంగంలోకి కేసీఆర్.. యువరక్తంతో నిండనున్న బీఆర్ఎస్.!

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్(ex Cm Kcr) తన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి…అయితే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీల(Guarantees) అమలుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో త్వరలో కేసీఆర్(KCR) ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2025 జనవరి(January) నుంచి బీఆర్ఎస్ (brs)అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం(congress govt)పై మాట్లాడటానికి ప్రజల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం కొత్త సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(Brs) పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జిల నియమించనున్నట్లు తెలుస్తుంది. జనవరి నుంచి ప్రారంభమయ్యే కొత్త కమిటీల్లో ఈ సారి పూర్తిగా యువ నాయకులకు( young leaders) కీలక పదవులు, భాద్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కులగణన (సమగ్ర కుటుంబ సర్వే) పూర్తయిన వెంటనే సర్వే ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే…

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణపై నేడు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు..

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ (Jammu Kashmir Assembly)లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణపై నేడు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకొన్నారు..నేడు కార్యక్రమాలు మొదలుకాగానే.. ఇంజినీర్‌ రషీద్‌ సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షీద్‌ అహ్మద్‌ షేక్‌ ఆర్టికల్‌ 370 పునరుద్ధరించాలనే బ్యానర్‌ను ప్రదర్శించగా, దీనిపై ప్రతిపక్ష భాజపా నేత సునీల్‌ శర్మ అభ్యంతరం తెలిపారు. దీంతో తీవ్ర గందరగోళం మొదలైంది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి పిడిగుద్దులతో దాడులు చేసుకొన్నారు.

దీంతో రంగంలోకి దిగిన అసెంబ్లీ మార్షల్స్‌ దాడులకు దిగిన ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు భాజపా ఎమ్మెల్యేలను బయటకు పంపారు. ఈ ఘటనపై భాజపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే ఖుర్షీద్‌కు అనుకూలంగా స్పీకర్‌ పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.

ఆర్టికల్‌ 370 పునరుద్ధరించాలని తీర్మానం..

2019లో కేంద్రం తొలగించిన ఆర్టికల్‌ 370, 32ఎ ను పునరుద్ధరించాలని కోరుతూ పీడీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలని కోరింది. బుధవారం కూడా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ శాసనసభ తీర్మానం చేసింది. దీనిని కూడా భాజపా సభ్యులు వ్యతిరేకిస్తూ తీర్మానం కాపీలను చింపేశారు.

ఈ ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా స్పందిస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పాక్‌తో చేయి కలిపింది.. ఉగ్రవాదులతో చేయి కలిపింది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

మాజి మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్‌..ఈడి అధికారులు నోటీసులు..!

మాజి మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై నోటీసులు ఇచ్చారట ఈడీ అధికారులు..గత ఏడాది జూన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి పై సోదాలు చేశారు ఈడి అధికారులు. 12 మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.

ED officials served notices to former minister Mallareddy

పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ తాజాగా నోటీసులు అందించారు ఈడీ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి అమ్మకున్నట్లు ఈడీ గుర్తించింది అని చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తవమో తెలియదు కానీ… తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి దీనిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి..

సునీత విలియమ్స్‌ క్షీణిస్తున్న ఆరోగ్యం..!

అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులపాటు ఉండటం వల్ల సునీత విలియమ్స్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల ఫొటో ఒకటి వైరల్‌గా మారింది..అందులో సునీత విలియమ్స్‌ బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనిపిస్తున్నారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ గుప్త పేర్కొంటున్నారు. 8 రోజుల మిషన్‌లో భాగంగా జూన్‌ 6న బోయింగ్‌ స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో సునీత, విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వీరిద్దరూ జూన్‌ 14న భూమిపైకి తిరిగి రావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా రాలేదు. వచ్చే ఫిబ్రవరిలో వారు భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే ముందే గొడవపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు

చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఎమ్మెల్యే వివేక్ పర్యటనలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఇందారం గ్రామ మాజీ సర్పంచ్ గొడవపడ్డారు.

ఇసుక దొంగతనాలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు చేస్తున్నావంటూ గొడవకు దిగారు.. ఒకానొక దశలో కొట్టుకునే వరకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే మధ్యలోనే వెళ్ళిపోయాడు…

*కాంగ్రెస్ లో రచ్చకెక్కిన గ్రూప్ వార్*
*–పాత, కొత్త నేతల మధ్య తీవ్ర విభేదాలు*
*–బహిరంగంగానే తిట్టుకుంటున్న లీడర్లు*
*–నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, సింగిల్విండో చైర్మన్*

మోత్కూర్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ రోజురోజుకు ముదిరిపాకన పడుతోంది. పాత, కొత్త నేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. నిన్నటి వరకు లీడర్ల మధ్య అంతర్గతంగా ఉన్న వర్గపోరు కాస్త తాజాగా వీధికెక్కి బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి సింగిల్ విండో చైర్మన్ అయిన పేలపూడి వెంకటేశ్వర్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకున్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తో గెస్ట్ హౌస్ రీఓపెనింగ్ ప్రోగ్రాం ఉండగా కాంగ్రెస్ లీడర్లంతా హాజరయ్యారు. పార్టీలు మారిన లీడర్లు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లు ఓవరాక్షన్ చేస్తున్నారని, పదేళ్లు పార్టీని నమ్ముకుని ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడి పని చేశామని, అధికారం వచ్చాక పార్టీలో చేరిన కొందరు డామినేట్ చేస్తున్నారని మండల అధ్యక్షుడు సత్యనారాయణ రుసరుసలాడారు. దీంతో ఆ ఇద్దరు లీడర్ల మధ్య మాటామాట పెరిగి తిట్టుకున్నారు. అక్కడే ఉన్న మిగతా లీడర్లు వారిద్దరిని వారించినా తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. ఎమ్మెల్యే సామేల్ కాన్వాయ్ వస్తుండడంతో గొడవ పడుతున్న నాయకులు, అక్కడున్న లీడర్లు అంతా సైలెంటయ్యారు. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలతో కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు రచ్చక్కగా తాజా సంఘటనతో కాంగ్రెస్లో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో బహిర్గతమైంది. ఇదివరకే ఈ గ్రూపుల పంచాయతీ ఎమ్మెల్యే సామేల్ వద్దకు వెళ్లగా ఆయన లీడర్లంతా విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని చెప్పినప్పటికీ వర్గపోరు రోజుకింత ముదురుతుందే తప్ప చెక్ పడడం లేదు. పదేళ్లు కార్యకర్తలకు అండగా ఉండకుండా కనిపించకుండా పోయిన లీడర్లు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లు బుల్డోజర్ రాజకీయాలు చేస్తుండడంతో అసలు కాంగ్రెస్ లీడర్లంతా రగిలిపోతున్నారు……

నేడు బెంగళూరుకు హైడ్రా బృందం..

రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటన..

బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలోని ‘హైడ్రా’ బృందం రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనున్నారు.

అక్కడ చెరువులను అధ్యయనం చేసి హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్లోని సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్లోని అప్పచెరువులకు పునరుజ్జీవం కల్పించనున్నారు.

అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్ మహానగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులతో ‘హైడ్రా’ అధికారులు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది…

*Bhatti Vikramarka | కులసర్వే తర్వాతే రిజర్వేషన్ల పెంపు: డిప్యూటీ సీఎం భట్టి..!!*

రేషన్‌ కార్డు, ఇల్లు ప్రామాణికం కాదు
Bhatti Vikramarka |
హైదరాబాద్‌, నవంబర్‌ : సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ప్రజాభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బుధవారం నుంచి ఇండ్ల జాబితాను తయారు చేస్తారని, ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేర్లతో కూడిన స్టిక్కర్లను అందజేస్తారని తెలిపారు. 9వ తేదీ నుంచి సర్వే మొదలవుతుందని చెప్పారు.

ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌బుక్‌లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కుటుంబ నిర్ధారణకు రేషన్‌కార్డుగానీ, ఇల్లుగానీ ప్రామాణికం కాదని చెప్పారు. ఒకే ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు ఉండొచ్చని, గతంలో ఒకే రేషన్‌ కార్డులో పేర్లు నమోదైనా ఇప్పుడు వేర్వేరు కుటుంబాలుగా కూడా ఉండొచ్చని తెలిపారు. అలాంటివారు విడివిడిగానే నమోదు చేసుకోవాలని కోరారు…

*ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు!*

ఏపీలో వచ్చే ఏడాది జనవరి లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త డిజైన్‌తో రేషన్ కార్డులు అందజేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.