ఆలయంలో పూజారికి అంటుకున్న మంటలు..!

నల్గొండ జిల్లా..
నకిరేకల్ పట్టణం శివాలయంలోని పూజారికి అంటుకున్న మంటలు ప్రమాదవశాత్తు జరిగిన ఘటన. ఎలాంటి అపోహాలు ఆవద్దు..

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నకిరేకల్ తెలిపినా వివరాలు ప్రకారం..
* ఉత్తరప్రదేశ్ కు చెందిన దీక్షిత్ అభిషేక్ శివాలయంలో అర్చకుడిగా గత కొంత కాలంగా పని చేస్తున్నాడు…
* రేపు కార్తీక పౌర్ణమి సందర్బంగా ఈ రోజు శివాలయం గర్భ గుడిలో ప్లోర్ క్లీనర్ కెమికల్ (ఫినాయిల్) తో శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తు రోజు వెలిగించే దీపపు మంట పూజారి యొక్క దోతికి అంటుకోవడం జరిగింది.
* దోతిని విప్పుతున్న సందర్భంలో అట్టి మంటలు చేతికి, కాళ్ళకు అంటుకోవడం వలన పూజారి కి స్వల్ప గాయాలు అయ్యాయి.
* పోలీసులకు సమాచారం అందిన వెంటనే పూజారీని చికిత్స నిమిత్తం నకిరేకల్ లోని శ్రీ కృష్ణ నర్సింగ్ హోం నందు అడ్మిట్ చేసి చికిత్స చేయడం అందించడం జరుగుతుంది.
* ప్రస్తుతం పూజారి యొక్క ఆరోగ్యం నిలకడగానే ఉంది ఉన్నది అన్నారు..