బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah)కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సవాల్ విసిరారు..ఆదివారం ఓ కార్యక్రమంలోని పాల్గొని మాట్లాడారు. దళితబంధు(Dalit bandhu)లో రాజయ్య చేసిన అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. తప్పు ఉందని తేలితే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్(KCR) కుటుంబం అవినీతి, అక్రమాల పుట్ట అని కీలక వ్యాఖ్యలు చేశారు. .దేవనూరు అటవీ భూముల(Devanur Forest Lands) కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పకుంటా అని సంచలన ప్రకటన చేశారు. ‘ఉప ఎన్నికలు వస్తయ్.. గెలుస్తా అని రాజయ్య ఆశ పడుతున్నడు.. కానీ అవేమీ జరుగవు’ అని ఎద్దేవా చేశారు. మొన్ననే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఇక నుంచి రాజయ్య చేసే ఆరోపణల విషయంలో చాలా సీరియస్గా ఉంటానని అన్నారు. ఆరోపణలు చేయడం కాదని.. నిరూపించాలని అన్నారు. ఇక నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.