Aడర్ -19 ఆసియా కప్ టోర్నీ షార్జా వేదికగా జరుగుతోంది. ఈ టోర్నీలో యువ భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడి ఓటమిపాలైన యువ భారత్.
రెండో మ్యాచ్లో 211 పరుగుల భారీ తేడాతో జపాన్ను మట్టికరిపించింది..భారత్ ఘన విజయం
అదే సమయంలో మూడో మ్యాచ్లో భాగంగా యువ భారత్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో షార్జా క్రికెట్ స్టేడియంలో తలపడింది. ఈ మ్యాచ్లో యూఏఈను భారత్ చిత్తుగా ఓడించింది. 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది
ముందుగా టాస్ గెలిచి యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ల దాటికి యూఏఈ కుప్పకూలింది. కేవలం 137 పరుగులే చేసింది. అందులో రయాన్ ఖాన్ అనే ఆటగాడు ఒక్కడే 35 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు.
దీంతో 44 ఓవర్లలోనే యూఏఈ ఆల్ఔట్ అయింది. ఇక భారత్ బౌలర్లలో యుధాజిత్ గుహ చెలరేగాడు. దాదాపు 3 వికెట్లు తీశాడు. అలాగే చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు తీశారు. ఇంకా ఆయుశ్ మాత్రే, కేపీ కార్తికేయ ఒక్కో వికెట్ పడగొట్టారు.