చిన్న తప్పిదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది…ఇంటి బయట వెలుతురు కోసం లాగిన విద్యుత్ తీగే ప్రమాదానికి కారణమైంది. మండలంలోని కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గ్రామంలో సోమవారం ఉదయం విద్యుదాఘాతానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామానికి చెందిన కొర్ర మోహనరావు ఇంటి బయట వెలుతురు కోసం స్విచ్ బోర్డు నుంచి వైరు లాగి బల్బు ఏర్పాటు చేయడం, దాని పక్కనే దుస్తులు ఆరబెట్టుకునేందుకు జియా వైరు కట్టడం ప్రమాదానికి కారణమైంది. బల్బు హోల్డర్కు జియా వైరు తగిలి దానిని ఆనుకుని ఉన్న విద్యుత్ తీగ తెగిపడడం, దానిని గమనించకుండా మోహనరావు కుమారుడు సంతోశ్ తాకడంతో ఆ బాలుడితో పాటు తల్లి, చెల్లి కూడా మృతి చెందారు. కళ్లెదుటే తల్లి, అన్న, అక్క కుప్పకూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోయారు. తమ కుటుంబంలో ఎవరికీ ఆధార్ కార్డులు లేకపోవడంతో పిల్లలను బడిలో చేర్పించుకోలేదని తండ్రి మోహనరావు తెలిపారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.